తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇదిలా ఉంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థాయి అనేది నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్లి పోయిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు( Bollywood Heroes ) ఎవరు తమదైన రీతిలో సినిమాలు చేయలేకపోతున్నారు.కారణం ఏదైనా కూడా బాలీవుడ్ హీరోలకు మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మన హీరోలను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.
మరి ఇలాంటి క్రమంలోనే మన హీరోలు ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నారనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.ఈ సంవత్సరం ఇప్పటికే కల్కి,( Kalki ) హనుమాన్,( Hanuman ) దేవర,( Devara ) పుష్ప 2( Pushpa 2 ) లాంటి నాలుగు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇక రాబోయే కొత్త సంవత్సరంలో కూడా భారీ విజయాలను సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
ఇక బాలీవుడ్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ఈ సంవత్సరం పెద్దగా ఆడలేదు.మన సినిమాలతో పోల్చుకుంటే వాళ్ళ సినిమాలు చాలావరకు తక్కువ రేంజ్ లో సక్సెస్ లను సాధించినవే కావడం విశేషం.ఇక ఈ దెబ్బతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నే అనెంతలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న మన సినిమా ఇండస్ట్రీ గురించి మనం ఎంత ఎక్కువ చెప్పుకున్న తక్కువే అవుతుంది.
ఇక దాదాపు మరొక పది సంవత్సరాల పాటు మన తెలుగు హీరోలే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని రూల్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఈ ఒక్క సంవత్సరాన్ని బేస్ చేసుకొని మన వాళ్ల హవా ఏ రేంజ్ లో కొనసాగుతుందో మనం ఈజీగా చెప్పొచ్చు…
.