సాధారణంగా కొందరి జుట్టు చాలా అంటే చాలా పల్చగా ఉంటుంది.పల్చటి జుట్టు కలిగిన వారికి ఎటువంటి హెయిర్ స్టైల్స్ సెట్ అవ్వవు.
పైగా ఎట్రాక్టివ్ గా కూడా కనిపించలేరు.ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా ( Hair thickly )మార్చుకునేందుకు తెగ ట్రై చేస్తూ ఉంటారు.
అయితే మీకు తెలుసా? మన వంటింట్లో ఉండే టీ పొడితో జుట్టును ఒత్తుగా మార్చుకోవచ్చని.అవును, మీరు విన్నది నిజమే.
టీలోని కెఫిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను ఉత్తేజ పరుస్తాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, జుట్టు రాలడాన్ని అడ్డుకోవడంతో పాటు కొత్త జుట్టు ఎదుగుదలకు తోడ్పడతాయి.
అయితే టీ పొడి ( Tea powder )నేరుగా కాకుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం( rice ), రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( fenugreek ) వేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అర గ్లాసు వాటర్ పోసుకోవాలి.
వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకోవాలి.అలాగే నైట్ అంతా నానబెట్టుకున్న మెంతులు, బియ్యాన్ని వాటర్ తో సహా వేసుకోవాలి.
చివరిగా 5 లవంగాలు ( 5 cloves )వేసి చిన్న మంటపై దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.గోరువెచ్చగా అయ్యాక ఆ వాటర్ లో వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి మిక్స్ చేశారంటే మంచి హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.ఒక స్ప్రే బాటిల్ లో ఈ టానిక్ ను నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.

టానిక్ అప్లై చేసుకున్న గంటన్నర అనంతరం తేలిక పాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఈ న్యాచురల్ టానిక్ ను కనుక వాడారంటే వద్దన్నా కూడా మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.ఈ టానిక్ హెయిర్ ఫాల్ సమస్యను దూరం చేస్తుంది.కొత్త జుట్టును మొలిపిస్తుంది.పల్చటి జుట్టును ఒత్తుగా మారుస్తుంది.అలాగే ఈ టానిక్ ను వాడడం అలవాటు చేసుకుంటే త్వరగా తెల్ల జుట్టు సమస్య కూడా రాకుండా ఉంటుంది.