పురాతన శిల్పకళ, భక్తి, సంప్రదాయాల సమ్మేళనంగా నిలిచే పూరీ జగన్నాథ ఆలయం( Puri Jagannath Temple ) భారతదేశంలో అత్యంత పవిత్ర క్షేత్రంగా భావించబడుతుంది.ఒడిశా రాష్ట్రంలోని పూరీలో ఉన్న ఈ ఆలయం చారిత్రక, ధార్మిక ప్రాముఖ్యతతో ప్రసిద్ధి పొందింది.
శ్రీకృష్ణుడిని జగన్నాథుడిగా పూజించే ఈ ఆలయంలో రోజూ వేలాదిమంది భక్తులు సందర్శించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు.అయితే, ఆదివారం నాడు ఈ పవిత్ర క్షేత్రంలో ఒక అసాధారణ సంఘటన చోటుచేసుకుని భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రతిరోజూ మాదిరిగానే ఆలయ శిఖరంపై ఎగురుతున్న జగన్నాథుని పవిత్ర పతాకాన్ని( flag of Lord Jagannath ) మార్చే కార్యక్రమం జరుగుతున్న సమయంలో, ఒక్కసారిగా ఓ గద్ద వచ్చి ఆ జెండా వైపు దూకింది.నోటితో ఆ జెండాను పట్టుకుని గాలిలో ఎగిరిపోయింది.
ఆ గద్ద ఆలయం చుట్టూ రెండు సార్లు చక్కర్లు కొట్టింది.ఈ దృశ్యం ఆక్షణానికి భక్తుల దృష్టిని ఆకర్షించి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
భక్తులు తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాన్ని బంధించి వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది.ఇది చూసిన చాలామంది నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు భక్తితో స్పందించారు.
జగన్నాథుని పతాకం పతితపావనంగా భావించబడుతుంది.ఆలయ దర్శనానికి ముందు, భక్తులు శిఖరంపై ఎగురుతున్న జెండాను నమస్కరించడం ఒక సంప్రదాయం.అలాంటి పవిత్ర జెండాను ఓ సాధారణ పక్షి ఎత్తుకెళ్లడం భక్తులను భావోద్వేగానికి గురిచేసింది.కొంతమంది భక్తులు ఈ సంఘటనను భగవంతుని సంకేతంగా భావించి, ఆ గద్దను దైవదూతగా అభివర్ణించారు.
ఆ గద్ద కొంత దూరంలో ఆ జెండాను వదిలేసింది.అక్కడికి వెళ్లిన భక్తులు జెండాను తీసుకువచ్చి ఆలయ అర్చకులకు అప్పగించారు.
ఆ జెండాను తిరిగి ఎగురవేయకుండా ప్రత్యేకంగా భద్రపరిచారు.ప్రస్తుతం ఆ జెండా ఆలయంలో ఒక విశిష్ట పటంలో ఉంచబడింది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.వివిధ ఆధ్యాత్మిక పేజీలు దీన్ని ‘దివ్య సంకేతం’గా పేర్కొంటుండగా, మరికొన్ని ఈ సంఘటనను ప్రకృతి, భక్తి మధ్య ఉన్న అవినాభావ సంబంధానికి నిదర్శనంగా భావిస్తున్నాయి.
పలువురు ప్రముఖులు కూడా స్పందిస్తూ దేవుని చలనాన్ని అభివర్ణించారు.ఈ సంఘటనపై ఆలయ అధికారులు స్పందిస్తూ, “ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు.
ఇది జగన్నాథుని అనుగ్రహం.ఆ గద్దను అడ్డుకోవడం కాదు, గౌరవించాలి అని పేర్కొన్నారు.