సాధారణంగా కొందరు ఉద్యోగస్తులు నైట్ షిఫ్ట్స్ చేస్తుంటారు.ముఖ్యంగా కాల్ సెంటర్లు, కార్పొరేట్ కంపెనీలు, సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఉద్యోగులు రాత్రి సమయాల్లోనూ పని చేస్తుంటారు.
అయితే ఇలా నిద్ర మానుకుని రాత్రళ్లు వర్క్ చేయడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్నది.అయినప్పటికీ, డబ్బు ఎక్కువ వస్తుందనో, ఇల్లు గడపడానికనో లేదా ఇతరితర కారణాల వల్ల సౌకర్యంగా ఉన్నా, లేకున్నా.
నిద్ర లేకపోయినా.నైట్ షిఫ్ట్స్ చేస్తారు.
అయితే ఇలాంటి వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా నైట్ టైమ్ వర్క్ చేసే వారు నిద్రను ఆపుకోవడానికి టీ, కాఫీలు అధికంగా తీసుకుంటారు.కానీ, రెగ్యులర్‌గా చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
కాబట్టి.ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
అలాగే రాత్రుళ్లు పని చేసే వారు.పగటి పూట ఖచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రించాలి.లేకుంటే గుండె వ్యాధులు, మధుమేహం, ఊబకాయం ఇలా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
డే టైమ్‌తో పోలిస్తే.నైట్ టైమ్ పని చేయడానికి ఎంతో ఎనర్జీ అవసరం.అందువల్ల, తాజాగా పండ్లు, నట్స్, ఎనర్జీ డ్రింక్స్, తీసుకోవాలి.
అదే సమయంలో షుగర్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.
నైట్ షిఫ్స్ చేసే వారు ఖచ్చితంగా డే టైమ్‌లో కనీసం ఇరవై, ముప్పై నిమిషాల పాటు వ్యాయామాలు చేయాలి.తద్వారా శరీరంలో హెల్తీగా, ఫిట్‌గా ఉంటుంది.మరియు రాత్రుళ్లు వార్క్ చేసేటప్పుడు మద్య మద్యలో బ్రేక్ తీసుకుని అటూ, ఇటూ నడిస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది.
ఒత్తిడి దరి చేరకుండా ఉంటుంది.
నైట్ టైమ్ పని చేసే వాటర్‌ను అధికంగా తీసుకోవాలి.
అప్పుడు శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.దాంతో అలసట దూరమై మీరు ఉత్సాహంగా పని చేస్తారు.