Shiva Lingam : శివలింగం పరమార్థం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా..

శివుని దేవాలయాల్లో ఉండే శివలింగాన్ని దేవాలయాలకు వెళ్లే భక్తులు ఎప్పుడు దర్శనం చేసుకుంటూనే ఉంటారు.శివలింగాన్ని దర్శించుకునే భక్తులు ఎన్నో వేల సార్లు శివలింగాన్ని చూసి ఉంటారు కానీ అందులో ఉన్న అర్థం గురించి ఎవరు ఆలోచించి ఉండరు.

 Have You Ever Wondered What Is The Ultimate Meaning Of Shiva Lingam ,  Shiva Lin-TeluguStop.com

భార్యా ధర్మం కలిగిన ప్రకృతి పానవట్టం.అంటే లింగరూప పురుషుడనే భర్తకు ఆమె అక్షం.

ధ్యానంలో ఉన్నపుడు చెడు ఆలోచనలు వస్తే అమ్మవారి నాభిలో శివ లింగం ఉన్నట్లు భక్తులు భావించాలి.అప్పుడా చెడు దృష్టి రాకుండా ఉంటుంది.

కొంత లింగభాగం పానవట్టంలో, మిగిలిన భాగం పైన ఉంటుంది.

దీనర్థం పరమాత్మ సర్వ జీవుల్లో, ప్రకృతి బయటా కూడా వ్యాపించి ఉంటాడని వేద పండితులు చెబుతారు.

శివలింగం ప్రకృతి-పురుషుల కలియకే జగత్తుకు మూలమని మనకి స్పష్టం చేస్తుంది.జలం ప్రాణాధారం కాబట్టి లింగానికి జలాభిషేకం చేస్తూ ఉంటారు.

అలా పడే ప్రతి నీటిబొట్టూ జీవులుగా రూపం తీసుకుని పానవట్టమనే పార్వతీదేవి ఒడిలో పోషణ పొంది, వృద్ధిచెంది చివరికి కాలం వచ్చాక కిందికి జారి తనువును చాలిస్తుంది.అలా జీవుల సృష్టి, పోషణ, వృద్ధి, మరణాలకు శివలింగం పరమార్ధం చూపుతుంది.

Telugu Bhakti, Devotional, Goddess Parvati, Lord Siva, Shiva Lingam-Latest News

శివుడి నుదుటి మీద ఉండే మూడు విభూతి రేఖలకు ఆధ్యాత్మిక అర్థం ఉంది.ఈ పుండ్రములు క్షర, అక్షర, పురుషోత్తమ అనే మూడు రూపాల్లో ఉంటాయి.క్షరులంటే అర్థం జీవులు అని, మరణం కచ్చితంగా ఉన్న వారిని అర్థం.అక్షర మంటే నాశనం లేని ఆత్మ అని అర్థం.ఇక పురుషోత్తముడు అంటే సాక్షాత్తు భగవంతుడే అని అర్థం.శివుడి మూడు అడ్డ నామాల వెనుకున్న పరమార్ధాలు వీటిని తెలుపుతాయి.

వీటిలో పై రేఖ పరమాత్మను, మధ్య రేఖ సర్వ వ్యాపకమైన ఆత్మను, కింది రేఖ జీవాత్మలను అర్థం వచ్చేలా తెలియజేస్తుంది.తెల్లని విభూతి ఆత్మ స్వచ్ఛమైనదని అర్థం వచ్చేలా చెబుతుంది.

ఆత్మ పరమాత్మలు ఎక్కడైనా కచ్చితంగా ఉంటాయని చెప్పడానికే మధ్య రేఖకు నడుమ కుంకుమతో అలంకరిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube