తరచూ గుడికి వెళ్ళేవారు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

మన హిందూ సాంప్రదాయాలలో భాగంగా ప్రతి ఒక్కరు దేవాలయాలకు వెళ్లి ఆ భగవంతుని దర్శనం చేసుకుంటారు.అయితే గుడికి వెళ్లే వారు పలు రకాల కోరికలు, ఎన్నో కష్టాలను మోసుకుని వెళ్లి దేవుని సన్నిధిలో స్వామివారికి తెలియజేస్తుంటారు.

 Temple,positive Energy,peace Of Mind,regular Temple Visiting Possiteve Vibes,hin-TeluguStop.com

గుడికి వెళ్లడం ద్వారా వారి మనసు తేలిక పడి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.ఈ విధంగా గుడికి వెళ్తారు అన్న విషయం మనకు తెలుసు….

కానీ సైన్స్ ప్రకారం భక్తులు గుడికి ఎందుకు వెళ్తారో అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం….

సాధారణంగా దేవాలయాలలో గర్భగుడిలోని విగ్రహాన్ని ప్రతిష్టించే ముందు విగ్రహం లోపల కొన్ని లోహాలను ఉంచుతారు.

ఆ లోహాల ద్వారా కాంతి ప్రసరించినప్పుడు అది శక్తిగా మారి గుడి ప్రాంగణంలో ఆ శక్తి ప్రసారం అవుతూ ఉంటుంది.అందుకోసమే గుడిలోకి వెళ్ళినప్పుడు ఆ శక్తి మనపై పడి మన మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది.

ప్రతిరోజు గుడికి వెళ్లి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే వారిలో ఈ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది.గర్భగుడి మూడువైపులా మూసి ఉంచి ఒకవైపు తెరచి ఉండటం ద్వారా అక్కడ ఎనర్జీ ఎక్కువగా ప్రసరిస్తూ ఉంటుంది.

గర్భగుడిలో వెలిగించే దీపం నుంచి వెలువడే కాంతి కూడా మనలో శక్తిని ప్రసారం చేస్తుంది.అందు వల్ల తరచు గుడికి వెళ్ళే వారిలో రోజురోజుకు వారిలో ఈ తరంగాలు ప్రసరించి, ఆయురారోగ్యాలతో, సానుకూల ఆలోచనలతో ఉంటారు.

కానీ అడపాదడపా దేవాలయాలను దర్శించుకునే వారికి లో ఇలాంటి మార్పులు గమనించడం కష్టం.ఎన్నో బాధలతో దేవాలయాలను దర్శించేవారికి, మానసిక అశాంతి కలిగిన వారు దేవాలయాలను దర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి తరంగాల ద్వారా శక్తి భక్తులలోకి ప్రవేశించి వారి మనసులో ఉన్న బాధలు తొలగిపోయి మానసికంగా ప్రశాంతత కలిగి, ఎంతో ధైర్యంతో ఉంటారని సైన్స్ ప్రకారం శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube