రామన్న ఆలయం ఎక్కడ ఉంది.. విశిష్టత ఏమిటో తెలుసుకుందాం..?

పురాణాల ప్రకారం ఆ పరమశివుడు దర్శనమిచ్చే శివలింగాన్ని కొందరు దేవతలు ఋషులు ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి.అయితే వీటిలో కొన్ని స్వయం భూగా వెలిసిన శివలింగాలు కూడా భక్తులకు దర్శనం ఇస్తున్నాయి.

 Ramanna Temple Unknown Facts And Uniqueness Of This Temple,  Ramanna Temple, Shi-TeluguStop.com

మరి శ్రీరాముడి చేత ప్రతిష్ఠించబడిన శివలింగం ఎక్కడ ఉంది… ఆలయం విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం….

తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా అటవీ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది.

ప్రకృతి అందాల మధ్యలో ఈ ఆలయం ఎంతో సుందరంగా నిర్మించబడి ఉంది.ఈ అటవీ ప్రాంతంలో ఒక కొండగుహలో రామన్న ఆలయం ఉంది.

ఈ గుహలో మనకు శివలింగం దర్శనమిస్తుంది.అయితే ఈ శివలింగాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్టించడం వల్ల ఈ ఆలయానికి రామన్న గండి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

సీతాన్వేషణ సమయంలో శ్రీరామచంద్రుడు ఈ గుహలో రాతి శివలింగం, నందీశ్వరుడు విగ్రహాలను ప్రతిష్టించి పూజలు జరిపారని అక్కడి స్థానికులు చెబుతుంటారు.రామన్న గండిగా విరాజిల్లుతున్న ఈ ఆలయం రాను రాను గండి రామన్న ఆలయంగా ప్రసిద్ధి గాంచింది.

ఈ ఆలయంలో శివలింగం మాత్రమే కాకుండా దక్షిణ ముఖంగా భక్తులకు దర్శనమిస్తూ రాతిపై ఆంజనేయుని విగ్రహం కూడా ఉంది.గుహలో స్వామివారు కొలువై ఉన్నప్పటికీ గుహలోకి ప్రవేశించిన భక్తులకు గాలి, వెలుతురు బాగా రావడంతో భక్తులు స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున వెళ్తుంటారు.

కొండ పై ఉన్నటువంటి ఈ గుహకు చేరుకోవడానికి గుహ వరకు మెట్లు ఉన్నాయి.

ఈ గుట్ట పైకి వెళితే మనకు కంచు బండ కనబడుతుంది.ఈ కంచు బండపై రాతితో కొడితే వచ్చే శబ్దం ఎంతో వినసొంపుగా ఉంటుంది.ఈ శబ్దం వినడానికి పెద్ద ఎత్తున ఈ ఆలయానికి చేరుకుంటారు.

ఈ విధంగా ప్రకృతి అందాల నడుమ సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు ప్రతిష్టించిన ఈ శివ లింగాన్ని దర్శించడం కోసం ప్రతిరోజు భక్తులు పెద్దఎత్తున ఈ ఆలయానికి వస్తుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube