10 నిమిషాల్లో మీ ఫేస్ సూపర్ బ్రైట్ గా మారాలంటే ఈ రెమెడీస్‌ ట్రై చేయండి!

ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్, మీటింగ్ లేదా ప్రియమైన వారితో డేట్ ఉన్నప్పుడు ముఖం డల్ గా క‌నిపిస్తే అస్సలు సహించలేరు.పైగా అటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి బ్యూటీ పార్లర్ కు వెళ్లేంత సమయం కూడా ఉండకపోవచ్చు.

 Try These Remedies To Make Your Face Super Bright In 10 Minutes Details, Bright-TeluguStop.com

అయినప్పటికీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు.నిజానికి ఎటువంటి చర్మ సమస్యలకైనా మన వంటింట్లో ఉండే పదార్థాలతోనే చెక్ పెట్టవచ్చు.

ఇక డల్ స్కిన్ ను( Dull Skin ) రిపేర్ చేయడానికి మ‌రియు ప‌ది నిమిషాల్లో మీ ఫేస్ ను సూపర్ బ్రైట్ గా మెరిపించడానికి కూడా అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి.ఆ రెమెడీస్‌ ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Skin, Dull Skin, Healthy Skin, Honey, Hot Milk, Skin Care, Skin Car

రెమెడీ 1:

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి,( Rice Flour ) పావు టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్లు షుగర్ మరియు పావు కప్పు హాట్ మిల్క్( Hot Milk ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ లేదా ఫ్రెష్ పొటాటో జ్యూస్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని పదినిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ సింపుల్ రెమెడీ మురికి, మృత కణాలను తొలగిస్తుంది.చర్మ కణాలను లోతుగా శుభ్రం చేస్తుంది.

డల్ నెస్ ను దూరం చేస్తుంది.ముఖ చర్మాన్ని సూపర్ బ్రైట్ గా మెరిపిస్తుంది.

Telugu Tips, Skin, Dull Skin, Healthy Skin, Honey, Hot Milk, Skin Care, Skin Car

రెమెడీ 2:

ఇన్స్టెంట్ బ్రైట్ స్కిన్ ను( Bright Skin ) పొందాలనుకునేవారు.ఒక బాల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్ వేసుకోండి.అలాగే వన్ టీ స్పూన్ తేనె మరియు నాలుగు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని పది నిమిషాలు పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా చేసుకోవాలి.ఈ రెమెడీని పాటించిన కూడా డల్ స్కిన్ సూపర్ బ్రైట్ గా మారుతుంది.షైనీ గా మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube