' ఆడలేక మద్దెల ఓడు ' .. జగన్ పై మరోసారి షర్మిల 

వైసీపీ అధినేత జగన్ పై( YS Jagan ) మరోసారి తీవ్ర విమర్శలు చేసారు ఆయన సోదరి,  ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.( YS Jagan ) అనేక అంశాలను తరుచూ ప్రస్తావిస్తూ,  జగన్ పై నేరుగా విమర్శలు చేస్తూ,  ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు  ఒక పక్క టిడిపి,  జనసేన విమర్శలతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతుండగా,  ఇంకో వైపు షర్మిల విమర్శలు మరింతగా జగన్ కు ఆందోళన కలిగిస్తున్నాయి.

 Appcc Chief Ys Sharmila Comments On Ys Jagan Details, Ysrcp, Jagan, Ap Cm Chandr-TeluguStop.com

తాజాగా మరోసారి జగన్ పై విమర్శలు చేశారు వైఎస్ షర్మిల.ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు( AP Assembly ) కొనసాగుతున్నాయి.ఈరోజు 5 బిల్లులను  సభలో ప్రవేశపెట్టనున్నారు  ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యే లు( YCP MLA’s )  హాజరు అవుతుండడం వంటి వ్యవహారాలపై జగన్ తీరును తప్పుపడుతూ, 

Telugu Ap Assembly, Ap Congress, Ap, Jagan, Jagan Sharmila, Sharmila Tweet, Ys S

షర్మిల విమర్శలు చేశారు.  అలాగే కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన షర్మిల విమర్శలు చేశారు.”  ఆడలేక మద్దెల వోడు అన్నట్లు ఉంది జగన్ తీరు.బడ్జెట్ బాగోలేదు అని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కానీ బడ్జెట్ అని వైసిపి( YCP ) కంటే ముందుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం.

మేము చెప్పింది జగన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు .మీకు మాకు పెద్ద తేడా లేదు .జగన్ కు 38% ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు మాకు తేడా లేదు.  38% ఓట్ షేర్ పెట్టుకుని అసెంబ్లీకి పోని వైసీపీ నే నిజానికి ఒక ” ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ ” ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదు.

Telugu Ap Assembly, Ap Congress, Ap, Jagan, Jagan Sharmila, Sharmila Tweet, Ys S

సొంత మైకుల ముందు కాదు, అసెంబ్లీ మైకుల ముందు మాట్లడమని మీకు చిత్తశుద్ధి ఉంటే,  నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దదిరిల్లేల చేయండి ” అంటూ షర్మిల ట్వీట్ చేశారు.ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోండి.  ఇంకా అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయండి .ఎన్నికలకు వెళ్ళండి.  అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్ .ఎవరు ఇంపార్టెంట్ తేలుతుంది కదా .వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ కి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలి.చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయింపు పై ప్రశ్నించడం ” అంటూ షర్మిల కామెంట్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube