జుట్టు విపరీతంగా ఊడిపోతుందా.? రోజురోజుకు కురులు పల్చగా మారుతున్నాయా.? జుట్టు రాలడాన్ని( Hairfall ) అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసి అలసిపోయారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఆయిల్ జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాక కురులు దట్టంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.జుట్టు ఆరోగ్యానికి అండగా ఉంటుంది.మరి ఇంతకీ ఆ ఆయిల్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక ఉల్లిపాయ( Onion ) మరియు రెండు ఉసిరికాయలు( Amla ) తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఐరన్ కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ఉసిరికాయ ముక్కలను వేసుకోవాలి.
వీటితో పాటు వన్ టేబుల్ స్పూన్ మెంతులు, రెండు లేదా మూడు మందారం ఆకులు వేసి చిన్న మంటపై పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లాబెట్టుకోవాలి.
పూర్తిగా కూల్ అయ్యాక స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న నాలుగు గంటల అనంతరం లేదా మరుసటి రోజు తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు కనుక ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్ సమస్య దెబ్బకు పరారవుతుంది.
అలాగే ఈ ఆయిల్ జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది.జుట్టు ఎదుగుదలకు మద్దతు ఇస్తుంది.కురలు దట్టంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.ఈ ఆయిల్ ను వాడడం అలవాటు చేసుకుంటే జుట్టు రాలడం తగ్గి దట్టంగా పెరుగుతుంది.
హెయిర్ బ్రేకేజ్ సమస్య కూడా దూరం అవుతుంది.