నలుగురిలోనూ తాము అందంగా కనిపించాలనే కోరిక దాదాపు అందరికీ ఉంటుంది.అందులోనూ ముగువలకు ఆ కోరిక కస్త ఎక్కువే.
ఈ నేపథ్యంలోనే ఖరీదైన క్రీములు, మాయిశ్చరైజర్లు, లోషన్లు, సీరమ్, సోపులు ఇలా ఎన్నెన్నో వాడుతుంటారు.అయితే అందంగా కనిపించడానికి అవీ, ఇవీ చర్మానికి రాసుకోవడమే కాదు.
పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.అలాగే కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల కూడా అందం దెబ్బ తింటుంది.
ఆ పొరపాట్లను సరిదిద్దుకోవడం ద్వారా కూడా అందాన్ని పెంచుకోవచ్చు.మరి లేటెందుకు ఆ పొరపాట్లు ఏంటో చూసేయండి.
అందాన్ని రెట్టింపు చేయడంలో కళ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి.ఇందులో భాగంగానే కళ్లకు ఐషాడో, ఐలైనర్, మస్కారా, కాజల్ వంటివి వేసుకుంటారు.కానీ, చాలా మంది చేసే పొరపాటు.ముఖానికి వేసుకునే మేకప్ తీస్తారు.
కానీ, కళ్లకు వేసుకన్నవి మరచిపోతారు.దాంతో కంటి వద్ద ముడతలు ఏర్పడి అందం దెబ్బ తింటుంది.
అందుకే వేసుకున్న మేకప్‌ను పూర్తిగా తొలిగించి వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.
రాత్రి నిద్రించే ముందు నైట్ క్రీమ్ రాసుకుంటుంటారు.
నైట్ క్రీమ్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.అయితే కొందరు చేసే పొరపాటు నైట్ క్రీమ్ చర్మానికి మంచిదని ఓవర్‌గా రాసేసుకుంటారు.
ఇలా చేస్తే మొదటికే మోసం వస్తుంది.అందుకే ఎంత అవసరమో అంతే నైట్ క్రీమ్ అప్లై చేసుకోవాలి.
![Telugu Beautiful Skin, Tips, Latest, Skin Care, Skin Care Tips-Telugu Health - Telugu Beautiful Skin, Tips, Latest, Skin Care, Skin Care Tips-Telugu Health -](https://telugustop.com/wp-content/uploads/2021/10/n-latest-news-skin-care-skin-care-tips-beauty.jpg)
అలాగే కొందరు నుదురుపై మేకప్ కాస్త ఎక్కువగా వేస్తారు.అయితే ఇలా చేయడం వల్ల మనం హావభావాలు పలికించినప్పుడు నుదురుపై ముడతలు పడి మేకప్ విడిపోతుంది.దాంతో అందవిహీనంగా కనిపిస్తారు.అందుకే నుదురుపై మేకప్ లైట్‌గా వేసుకోవాలి.
కొందరు ప్రతి వారం ఫేస్ స్క్రబ్ చేసుకుంటారు.కానీ, లిప్ స్క్రబ్ చేసుకోరు.
దాంతో పెదవులు డ్రైగా, నిర్జీవంగా మారి అందాన్ని దెబ్బ తీస్తాయి.అందుకే తరచూ లిప్స్‌ను స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి.
![Telugu Beautiful Skin, Tips, Latest, Skin Care, Skin Care Tips-Telugu Health - Telugu Beautiful Skin, Tips, Latest, Skin Care, Skin Care Tips-Telugu Health -]( https://telugustop.com/wp-content/uploads/2021/10/beautiful-skin-latest-news-skin-care-skin-care-tips-beauty-beauty-tips.jpg)
కేశాల విషయానికి వస్తే.తడి జుట్టును దువ్వడం, అల్లడం వంటివి అస్సలు చేయరాదు.మరియు జుట్టు తడిగా ఉన్నప్పుడు ఎటువంటి కేశ సంబంధిత ఉత్పత్తులను ఉపయోగించరాదు.
ఇక వీటితో పాటు అందంగా కనిపించాలంటే పోషకాహరం తీసుకోవాలి.
కంటినిండా నిద్రపోవాలి.కెమికల్స్ ఎక్కువగా ఉండేవి కాకుండా.
మంచి స్కిన్ కేర్ ప్రోడెక్ట్స్‌ను యూజ్ చేయాలి.వాటర్ అధికంగా తీసుకోవాలి.