మెరుగైన ఉపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)( United Arab Emirates ) ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది.అక్కడి ప్రభుత్వం కూడా పలు రాయితీలు ప్రకటిస్తూ పలువురిని ఆకట్టుకుంటోంది.
దుబాయ్, షార్జా, అబుదాబీ వంటి వరల్డ్ క్లాస్ నగరాలు కూడా రమ్మని పిలుస్తున్నాయి.దీంతో ఇటీవలి కాలంలో యూఏఈ వైపు పలువురు ఆకర్షితులవుతున్నారు.
అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడంతో పాటు పర్యాటకంగానూ యూఏఈ దూసుకెళ్తోంది.
ఈ నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే భారతీయ పౌరుల కోసం వీసా ఆన్ అరైవల్( Visa On Arrival ) కార్యక్రమాన్ని విస్తరించగా.ఇప్పుడు మరో ఆరు దేశాలలోని భారతీయ పౌరులకు( Indian Nationals ) కూడా ఈ కార్యక్రమాన్ని వర్తింపజేసింది.
ఫిబ్రవరి 13 నుంచి సింగపూర్,( Singapore ) జపాన్,( Japan ) దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడాలకు చెందిన చెల్లుబాటయ్యే వీసాలు, నివాస అనుమతులు, గ్రీన్‌కార్డ్‌లు ఉన్న భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు యూఏఈలోని అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద వీసా ఆన్ ఎరైవల్‌కు అర్హులని పేర్కొంది.

ఈ అర్హతను సాధించడానికి .భారతీయ ప్రయాణీకులు కనీసం ఆరు నెలల చెల్లుబాటుతో కూడిన సాధారణ పాస్‌పోర్ట్‌ను సమర్పించాలి.అలాగే యూఏఈ నిబంధనల ప్రకారం వర్తించే వీసా రుసుమును చెల్లించాలి.14 రోజుల బసకు వీసా ప్రవేశ రుసుము 100 దిర్హామ్‌లు, 250 దిర్హామ్‌లతో అదనంగా దీనిని 14 రోజులు పొడిగించవచ్చు.

ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ.( Federal Authority Of Identity ) సిటిజన్‌షిప్ , కస్టమ్స్ , పోర్ట్స్ సెక్యూరిటీ , భారత్ – యూఏఈ మధ్య ప్రయాణ , వ్యాపార సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ తెలిపింది.గతంలో ఈ విధానం అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు, యూకేల చెల్లుబాటయ్యే డాక్యుమెంటేషన్ కలిగి ఉన్న భారతీయ పౌరులకు మాత్రమే వర్తించేది.
యూఏఈ ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆయా దేశాల్లోని భారతీయ ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.