ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో విస్తృతంగా వైరల్( Viral Video ) అవుతోంది.అది కాస్తా పెద్ద చర్చకు దారితీసింది.
ఆ వీడియోలో ఒక మహిళ డ్యాన్స్ చేస్తూ కనిపించింది.ఆమె రీసెంట్‌గా దివ్యాంగుల కోటాలో( Disability Quota ) గవర్నమెంట్ జాబ్( Government Job ) సంపాదించింది.
అయితే, రాధే జాట్ అనే నేషనల్ ఎడ్యుకేటెడ్ యూత్ యూనియన్ లీడర్ ఆమె దివ్యాంగురాలా కాదా అని ప్రశ్నించారు.ఎయిమ్స్ భోపాల్ చేసిన మెడికల్ టెస్ట్ సరిగ్గా జరగలేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
అందుకే ఆమెకు మళ్లీ మెడికల్ టెస్ట్( Medical Test ) చేయాలని డిమాండ్ చేశారు.
వీడియోలో కనిపిస్తున్న ఆ మహిళ పేరు ప్రియాంక కదమ్.( Priyanka Kadam ) తనపై వస్తున్న ఆరోపణలకు ఆమె గట్టిగా సమాధానం ఇచ్చింది.తనకు హిప్‌కి చాలా పెద్ద సర్జరీలు జరిగాయని, ఆ సర్జరీల వల్లే తాను నడవగలుగుతున్నానని, కాసేపు డ్యాన్స్( Dance ) కూడా చేయగలుగుతున్నానని ఆమె చెప్పారు.
“నేను చాలా సాదాసీదా కుటుంబం నుంచి వచ్చాను.ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను.
చూడ్డానికి నేను మామూలు మనిషిలా కనిపించొచ్చు.కానీ నా బాడీలో మెడికల్ ఇంప్లాంట్స్ ఉన్నాయి.
వాటి వల్లే నేను మూవ్ అవ్వగలుగుతున్నాను.అందుకే డాక్టర్లు చెప్పినట్లు కొద్దిసేపే డ్యాన్స్ చేయగలుగుతాను.
నొప్పి మాత్రం ఇంకా ఉంటుంది.అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకోవాల్సి వస్తుంది” అని ఆమె వివరించింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ప్రియాంక చెప్పిన ప్రతి మాటా మన కళ్లు తెరిపించే గుణపాఠం అని, క్షణకాలం కనిపించే వీడియోను చూసి మనుషుల గురించి ఒక పట్టానా తీర్పులు ఇవ్వడం చాలా తప్పు అని అంటున్నారు.“కెమెరా కంటికి కనిపించేది వాళ్ల జీవితంలో ఒక చిన్న ముక్క మాత్రమే.అసలు నిజం అందులో దాగి ఉండకపోవచ్చు.
కాస్తంత ఆలోచించాలి మనం, ఎవరి గురించి తొందరపడి ముద్ర వేయొద్దు.ఎవరి కష్టం ఎలా ఉంటుందో మనకు తెలీదు కదా కాస్తంత మానవత్వం చూపిస్తే చాలు… ఎంతో మంది బాధపడకుండా ఉంటారు.
ఒక్క క్షణం ఆగితే… ఎదుటి మనిషిలోనూ మనల్ని మనం చూసుకుంటాం” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.