స్త్రీలలో రక్తం మరీ ఎక్కువగా బయటకివస్తోందా? అయితే ఇదిగోండి మందు

Anaemia అంటే రక్తహీనత.శరీరంలో సరిపడ రక్తం లేకపోవడం.

 Tranexamic Acid Will Reduce Bleeding In Women – Study-TeluguStop.com

ఇది మహిళల్లో, ముఖ్యంగా భారతీయ మహిళల్లో అతి సాధారణంగా కనిపించే సమస్య.చెన్నైలోని మెట్రోపోలీస్ హెల్త్ కేర్ అనే పాతోలాజి ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ చెప్పటిన ఓ సర్వే ప్రకారం ప్రతి ఇద్దరు భారతీయ మహిళల్లో ఒకరికి రక్తం తక్కువగా ఉంటోందని తేలింది.

అందుకే అన్నాం కదా, ఇది స్త్రీలలో కనిపించే అతిసాధారణమైన సమస్య అని.ఈ అనేమియా సమస్యని మీద మహిళలు అప్రమత్తంగా ఉండి, ఆదిలోనే టెస్టులు చేయించి, తగిన డైట్, చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు.అసలు మహిళల్లో రక్తహీనత ఇంతలా పెరగటానికి కారణం ఏమిటి ? పురుషుల్లో ఎక్కువగా లేని ఈ సమస్య మహిళల్లోనే ఎందుకు?

ఎందుకంటే పీరియడ్స్ లో రక్తం బయటకు పోవడం వలన.ఇది నార్మల్ గా జరిగేదే.కాని చాలామందికి నార్మల్ కన్నా ఎక్కువ రక్తం బయటకి పోతుంది.సి సెక్షన్ డెలివరీ, గర్భాశయం తొలగించుకున్న మహిళల్లో ఇది మరీ ఎక్కువ.అందుకే మహిళలు రక్తహీనత బారిన పడతారు.దీనికి చికిత్స లేక కాదు, సరైన డైట్ ని పాటించేవారు లేక.ఐరన్ శాతం ఎక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి అని తెలిసినా, డైట్ ని ఫాలో చేయరు.దాంతో సమస్య పెరిగి చివరకి ప్రాణాల మీదకి వస్తుంది.

అలాంటి బద్ధకస్తుల కోసమే ఓ సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది.ఎక్కడో వేరే దేశంలోనే, వేరే నగరంలోనే కాదు, మన హైదరాబాద్ లో ఇది అందుబాటులో ఉంది.

దీని పేరు Tranexamic Acid.దీన్నీ 21 దేశాల్లో 20000 మందిపైకి పైగా మహిళలపై టెస్ట్ చేసారు.అన్ని టెస్టులు నిర్వగించాకే ఇది రక్తస్రావాన్ని కంట్రోల్ చేస్తుందని, Postpartum Haemorrhage లాంటి సమస్యను కూడా దగ్గరికి రానివ్వకుండా ఆపి, మరణాన్ని కూడా ఆపుతుందని హైదరాబాద్ డాక్టర్లు చెబుతున్నారు.ఈ మెడిసిన్ మీద ఆరు సంవత్సరాల పాటు పరిశోధనలు జరిగాయి.

ఒక్క గ్రామ్ తో ఒక్క డోస్ ఇచ్చిన తగ్గకపోతే, రెండొవ డోసులో మరో గ్రామ్ ఇచ్చి మరి వారి ప్రాణాల్ని కాపాడుకున్నారు డాక్టర్స్.అందుకే దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజెషన్ (WHO) గుర్తింపు కూడా లభించింది.

కాబట్టి ఎలాంటి అనుమానాలు లేకుండా, రక్తహీనత సమస్య ఉందని తెలిస్తే, డాక్టర్ ని సంప్రదించి ఈ మెడిసిన్ గురించి మాట్లాడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube