సూపర్ స్టార్ క్రిష్ణ.ఆయన పేరు వినగానే యాక్షన్ సినిమాలు మాత్రమే గుర్తొస్తాయి.
కానీ తను పలు హాస్య ప్రధాన సినిమాల్లోనూ నటించాడు.అంతేకాదు.
ఆయా సినిమాల్లో చక్కటి నటన కనబర్చి జనాల మెప్పు పొందాడు.వినోదానికి చెవి కోసుకునే తెలుగు జనాల మీదికి దర్శకడు విజయ బాపినీడు సంధించిన నవ్వుల బాణం మహారాజశ్రీ మాయగఢ్.
కన్నడంలో మంచి విజయాన్ని అందుకున్న భాగ్యలక్ష్మి బారమ్మ సినిమాను తెలుగులో తెరకెక్కించారు.ఈ సినిమా రీమేక్ తెలుగు హక్కులు తీసుకుని నిర్మించారు రాధాక్రిష్ణ మూర్తి, నారాయణ.
విజయ బాపినీడు దర్శకత్వంలోనే క్రిష్ణ.క్రిష్ణగారడీ అనే సినిమా చేశాడు.
ఈ సినిమాకు కూడా రాధా క్రిష్ణ మూర్తే నిర్మాత.
క్రిష్ణ, విజయ బాపినీడు కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా మహారాజశ్రీ మాయగఢ్.
ఈ సినిమా మూల కథలో చాలా మార్పులు చేశాడు దర్శకడు.ఎలాంటి మెసేజ్ ఇవ్వకుండా.
జనాలను నవ్వించడమే ధ్యేయంగా ఈ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమాలో క్రిష్ణ సరసన శ్రీదేవి నటించింది.
దాదాపు ఏడాది తర్వాత శ్రీదేవి, క్రిష్ణ కలిసి ఈ సినిమా చేశారు.అప్పటికే శ్రీదేవి బాలీవుడ్ లో బాగా బిజీ అయ్యింది.
అయితే క్రిష్ణతో సినిమా అనగానే డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని మరీ ఈ సినిమాలో నటించింది.తను అప్పటి వరకు పోషించిన పాత్రలతో పోల్చితే ఈ సినిమా మరింత భిన్నంగా ఉండటంతో తను ఓకే చెప్పింది.
ఈ సినిమాలో క్రిష్ణ, శ్రీదేవి పోటీపడి మరీ నటించారు.ఈ సినిమా టైటిల్ నిజానికి చాలా గాంభీర్యంగా ఉంటుంది.ఇందులో క్రిష్ణ చాలా పవర్ ఫుల్ రోల్ పోషించి ఉంటాడని జనాలు అనుకుంటారు.కానీ థియేటర్ లోకి వెళ్లాక అసలు విషయ తెలుస్తుంది.ఇందులో క్రిష్ణ చేసిన కామెడీ జనాలను బాగా నవ్విస్తుంది.ఆయన నటనకు జనాలకు కూడా ఫిదా అవుతారు.
క్రిష్ణలో ఇంత మంచి హాస్య నటుడు ఉన్నాడా అని ఆశ్చర్యపోతారు.అంతేకాదు.
ఈ సినిమాను కూడా బాగా ఆదరించారు జనాలు.