పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ ( Allu Arjun )వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడడం, ఆ వ్యవహారంలో అల్లు అర్జున్ తో పాటు, మరికొంతమందిపై కేసు నమోదు అయింది .
ఈ కేసులో అల్లు అర్జున్ ని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయడం, బెయిల్ పై ఆయన బయటకు రావడం జరిగాయి.ఇక ఈ వివాదం రాజకీయంగాను రచ్చ గా మారింది.
సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )ఈ వ్యవహారంలో సీరియస్ గా ఉండడం, ఇప్పటికే అల్లు అర్జున్ పై ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేయడం తదితర పరిణామాలతో ఈ వివాదం రోజురోజుకు మరింత ముదురుతూనే వస్తోంది దీంతో ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు ప్రముఖ సినీ నిర్మాత ,ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మవ్ దిల్ రాజు రంగంలోకి దిగారు.
![Telugu Allu Arjun, Dil Raju, Dil Rajus, Revathi, Sandhya Theatre-Politics Telugu Allu Arjun, Dil Raju, Dil Rajus, Revathi, Sandhya Theatre-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/12/Is-this-the-reason-behind-Dil-Rajus-entry-for-Alluc.jpg)
దిల్ రాజుకు( Dil Raju ) అటు సినిమా ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయంగాను విస్తృతంగా పరిచయాలు ఉండడం ,సామాజిక వర్గం కలిసి రావడంతో అల్లు అర్జున్ వివాదానికి చెక్ పెట్టేందుకు ఆయన పావులు కలుపుతున్నారు .ఈ మేరకు అల్లు అరవింద్ టీం దిల్ రాజును రంగంలోకి దింపినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ వివాదంలో పెద్దగా మాట్లాడని దిల్ రాజు తాజాగా హాస్పిటల్ కు వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించారు.
శ్రీ తేజ్ తండ్రికి తను సినిమా ఇండస్ట్రీలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.అలాగే ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి తోనూ మాట్లాడుతానని హామీ ఇచ్చారు.
అయితే ఒక్కసారిగా దిల్ రాజు ఈ వివాదానికి ముగింపు పలకాలనుకోవడం,, ఈ బాధ్యతలను భుజాన వేసుకోవడానికి గల కారణాలు ఏమిటనే దానిపైనే చర్చ జరుగుతుంది.సంక్రాంతి పండుగ అంటే దిల్ రాజు సినిమాలే ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి.
ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఎక్కువగా నష్టపోయేది దిల్ రాజు నే.
![Telugu Allu Arjun, Dil Raju, Dil Rajus, Revathi, Sandhya Theatre-Politics Telugu Allu Arjun, Dil Raju, Dil Rajus, Revathi, Sandhya Theatre-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/12/Is-this-the-reason-behind-Dil-Rajus-entry-for-Allub.jpg)
బెనిఫిట్ షో ,టికెట్ల ధరల పెంపు( Benefit show, increase in ticket prices ) ఉండకపోతే ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ అంశాలపై చర్చించడంతో పాటు , అల్లు అర్జున్ వివాదానికి ముగింపు పలకాలని దిల్ రాజు భావిస్తున్నారు.అల్లు అరవింద్ దిల్ రాజు ఇద్దరు బడా నిర్మాతలే.
చాలావరకు సినిమా ధియేటర్లు వీరి ఆధీనంలోనే ఉన్నాయి.అల్లు కుటుంబానికి నష్టం జరిగినా దిల్ రాజుకు అంతే స్థాయిలో నష్టం జరుగుతుంది.
దీంతో ఆ నష్టాల నుంచి భయటపడేందుకు దిల్ రాజు ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టించే బాధ్యతను తీసుకున్నారు.ఇప్పటికే అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను కలిసి ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని భావించారు.
ఈ మేరకు దీపా దాస్ మున్షిని కలవాలని ప్రయత్నించినా, వర్కౌట్ కాలేదు.దీంతో దిల్ రాజు ఎంట్రీ ఇచ్చి అల్లు అర్జున్ వివాదానికి, చెక్ పెట్టడంతో పాటు, సినిమా ఇండస్ట్రీ పరంగాను రాజకీయంగాను ఎవరికి నష్టం జరగకుండా పెద్దన్న పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నారట.