గుండె ఆరోగ్యంగా ఉండాలంటే జామపండు తినండి

జామపండు చాలా చవగ్గా దొరుకుతుంది.ఒకరి ఇంట్లో కాకాపోతే రెండో ఇంట్లో కనబడేది జామచెట్టు.

 Benefits That Guavas Bring To Human Heart-TeluguStop.com

ఇప్పుడు నగరాల్లో తక్కువగా కనిపిస్తున్నా, కాస్త పల్లేటూళ్ళ వైపు వెళ్ళి చూస్తే జామచెట్లు కనబడటం చాలా కామన్ విషయం.ఈ జామను రోజు తినే అలవాటు ఉన్నవారి గుండె చాలా బలంగా తయారవుతుంది.

అది ఎలా అని అడుగుతున్నారా!

* జామలో యాంటిఆక్సిడెంట్స్ కి కొదువ లేదు.మన శరీరానికి ఉపయోగపడే యాంటిఆక్సిడెంట్స్ చాలావరకు జామలో దొరుకుతాయి.

అందులో లైకోపెన్ చాలా మఖ్యమైనది.ఈ లైకోపెన్ ఆర్టెరీస్ ని ఇంఫ్లేమేషన్ నుంచి కాపాడుతుంది.

ఆర్టెరీస్ గుండెకి చేసే సేవ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటా.

* ఒంట్లో పొటాషియం తక్కువైతే గుండెకి చాలా ప్రమాదం.

ఇలాంటి కండీషన్ గుండెకి పాల్పిటేషన్ లాంటి సమస్యను తీసుకురాగలదు.జామలో పొటాషియం బాగా దొరుకుతుంది.

కాబట్టి నిస్సందేహంగా కుదిరినన్ని జామపండ్లు తినండి రోజు.

* విటమిన్ సి అనగానే మనకి ఆరెంజ్ లేదా ఏదైనా సిట్రస్ జాతి ఫలాలు గుర్తుకు వస్తాయి కాని, జామలో ఆరెంజ్ కన్నా ఎక్కువ విటమిన్ సి కంటెంట్ ఉంటుంది తెలుసా.

అది కూడా నాలుగు రేట్లు ఎక్కువ.విటమిన్ సి బ్యాడ్ కొలెస్టరాల్ ని తగ్గించి, గుడ్ కొలెస్టరాల్ లెవెల్స్ ని పెంచి గుండెని సురక్షితంగా ఉంచుతుంది.
* జామపండు బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో ఉంచగలదు.దీనికంత సామర్థ్యం ఉంది కాబట్టే ఆయిర్వేదలో దీనికి త్రిదోష నాషక్ అనే పేరు పెట్టారు.

* అరకిలో జామపండ్లలో ఓరోజులో ఒంటికి సరిపడ ఫైబర్ దొరుకుతుంది తెలుసా.జామలో ఫైబర్ దండిగా ఉంటుంది.

ఈ డైటరి ఫైబర్ తో బ్యాడ్ కొలెస్టరాల్ లెవెల్స్ కి చెక్ పెట్టి గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube