ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా తినేస్తున్నార.. కాస్త జాగ్రత్త సుమా..!

కరకరలాడే ఆలూ చిప్స్ చాలా టేస్ట్ గా ఉంటాయి కానీ అవి ఎక్కువగా తింటే అనేక జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.ఇటీవల కాలంలో ఫ్రెంచ్ ఫ్రైస్ (మన పరిభాషలో ఆలూ చిప్స్) బాగా ఫేమస్ అయ్యాయి.

 Are You Eating More French Fries Be Careful, Allu Chips, French Fries, Oil Fry,-TeluguStop.com

అన్ని సూపర్ మార్కెట్స్ లలో ఫ్రెంచ్ ఫ్రైస్ కేజీల చొప్పున లభిస్తున్నాయి.వీటిని నూనెలో వేయించి తింటే చాలా కమ్మగా ఉంటాయి.

అయితే ఇవి ఒకటి, రెండు తిని ఆప లేనంత టేస్టీ గా ఉండటంతో చాలామంది ప్రజలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా ఆరగించేస్తుంటారు.కానీ తరచూ ఎక్కువ మొత్తంలో ఆలూ చిప్స్ తినేవారు అనేక ప్రాణాంతకమైన జబ్బుల బారిన పడి చనిపోతారు అని ఒక అధ్యయనంలో తేలింది.

ది అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ మ్యాగజైన్ లో తాజాగా ఒక అధ్యయనం ప్రచురితమయ్యింది.ఈ అధ్యయనం చేసిన పరిశోధకులు మొత్తం 4500 మందికి వారానికి రెండు సార్లు కంటే ఎక్కువ సార్లు ఆలూ చిప్స్ ఆహారంగా ఇచ్చారు.

అయితే ఫ్రైస్ తిన్నవారిలో చనిపోయే ప్రమాదం రెట్టింపు అయిందని వారి అధ్యయనంలో తేలింది.ఆలుగడ్డ ముక్కలను నూనెలో వేయించడం కారణంగా.చెడు కొవ్వు శరీరంలోకి ప్రవేశించి రక్తనాళాలలో పేరుకుపోయి గుండెపోటుకు కారణం అవుతుంది.అందుకే నూనెలో చాలాసేపు వేయించిన ఆహారానికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

Telugu Allu Chips, Bad Cholesterol, Fats, French, Care, Tips, Heart Attack, Oil

నూనెలో వేయించిన ఆలూ చిప్స్ త్వరగా జీర్ణం కావని.తీవ్రమైన కడుపునొప్పి వచ్చే ప్రమాదం ఉందని జర్నల్ అల్ట్రాసౌండ్ ఇంటర్నేషనల్ ఓపెన్‌లో రాసిన ఓ అధ్యయనం లో వెల్లడించారు.రక్తం లో ఎక్కువగా చెడు కొవ్వు పేరుకుపోతే మతిమరుపు వచ్చే ప్రమాదం కూడా ఉందని తేలింది.ట్రాన్స్ ఫ్యాట్ కలిగిన నూనె పదార్ధాలు రోజు తింటుంటే రోగనిరోధక శక్తి పూర్తిస్థాయిలో తగ్గిపోతుంది.

ఫలితంగా శరీరం అనేక రోగాలకు గురి అవుతుంది.నూనెలో వేయించిన ఆహార పదార్థాలను వారానికి మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు తిన్నట్లయితే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం 7 శాతం పెరిగిపోతుందని ఒక స్టడీలో వెల్లడైంది.

అందుకే టేస్టీగా ఉన్నాయి అని తరచూ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే మృత్యు తరుముకుంటూ రావటం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube