1.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1200 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2.రాజధాని పై హైకోర్టు తీర్పు పై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు
అమరావతి రాజధాని పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారు.ఈనెల 3వ తేదీలోగా సి ఆర్ డి ఎ రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో పనులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సూచించిన నేపథ్యంలో సీఎస్ ఈ అఫిడవిట్ దాఖలు చేశారు.
3.రేపటి నుంచి కాంగ్రెస్ ఆందోళనలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైకిరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
4.బంగారు తెలంగాణ దిశగా ముందుకు : కేసిఆర్
బంగారు తెలంగాణ దిశగా ముందుకు వెళ్తామని, బేధం, వివక్ష లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
5.ప్రగతి భవన్ లో ఉగాది వేడుకలు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు.
6.గవర్నర్ సంచలన కామెంట్స్
తెలంగాణ గవర్నర్ తమిళ సై సంచలన కామెంట్స్ చేశారు గవర్నర్ హోదాలో తన పరిమితులు తనకు తెలుసునని , నన్ను ఎవరు నియంత్రించ లేదని గవర్నర్ వ్యాఖ్యానించారు.
7.ఆస్తి పన్నులో ఐదు శాతం రాయితీ
చిన్న స్థాయిలో ఆస్తి పన్ను వసూలు కాకపోవటం పై ఎర్లీ బర్డ్ వసూళ్లపై జిహెచ్ఎంసి దృష్టి పెట్టింది.2022- 23 ఆర్థిక సంవత్సరానికి పన్ను ఈ నెలలో చెల్లిస్తే ఐదు శాతం పన్ను లో రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
8.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 56, 958 మంది భక్తులు దర్శించుకున్నారు .
9.నిమ్స్ కు ప్రణయ్ హత్య కేసు నిందితుడు
అప్పట్లో సంచలనం సృష్టించిన నల్గొండ ప్రణయ్ హత్య కేసు నిందితుడు అబ్దుల్ బారిని జైలు అధికారులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
10.నేటి నుంచి భద్రాచలంలో తిరు కళ్యాణోత్సవాలు
నేటి నుంచి భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వసంత పక్ష ప్రయుక్త తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
11.తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
తెలంగాణా ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
12.ఎస్ ఆర్ పీ సీ చైర్మన్ గా ప్రభాకర రావు
తెలంగాణా జెన్ కో, ట్రాన్స్ కో ఎండీ ప్రభాకరరావు ను సదరన్ రీజినల్ పవర్ కమిటీ చైర్మన్ గా ప్రబుతవం నియమించింది.
13.డ్రగ్స్ కేసు విచారణకు సిట్
తెలంగాణలో డ్రగ్స్ కేసు విచారణకు జాతీయస్థాయిలో సిట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచించారు.
14.కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు
టిడిపి శ్రేణులు ప్రజాక్షేత్రంలో వెళ్లి పనిచేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
15.6 నుంచి లాసెట్ దరఖాస్తులు
ఈనెల ఆరో తేదీ నుంచి లా సెట్ దరఖాస్తులను స్వీకరిస్తారు.ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
16.ప్రవీణ్ కుమార్ విమర్శలు
తెలంగాణ సీఎం కేసీఆర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారారని బిఎస్పి నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
17.జనసేన ఆర్థిక సహాయం ప్రకటన
ఏపీలో అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న ఏపీ లోని రైతులను ఆదుకునేందుకు జనసేన ముందుకు వచ్చింది.కుక్కు బాధిత కుటుంబానికి లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
18.తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ బోల్తా
ఏపీ ప్రభుత్వం కొత్త గా తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.శ్రీకాకుళం జిల్లాకు కేటాయించిన తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ శ్రీకాకుళం జిల్లా, నక్కపల్లి మండలం, వడ్డి మెట్ట జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
19.ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం ప్రారంభం
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి పై ఈరోజు ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభం అయ్యింది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,950
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,480
.