ఈ మధ్యకాలంలో చాలామంది శరీరంలో అధిక బరువు వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.అయితే ఓ టీ ని తాగడం వలన ఇప్పుడు ఈజీగా అధిక బరువు తగ్గవచ్చు.
దీంతో పాటు పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కూడా ఈజీగా కరిగిపోతుంది.అధిక బరువు వలన బాధపడుతున్న వారు ఈ టీ నీ తాగడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి.
ఈ టీ తాగడం వలన ఒకే నెలలో ఈజీగా 5 కిలోల వరకు బరువు తగ్గవచ్చు.అంతేకాకుండా ఇది తాగడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా ప్రయోజనాలను పొందుతుంది.
ఈటీవీ తాగడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా తగ్గిపోతాయి.

అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి.అంతేకాకుండా ఈ టీ నీ తాగడం వలన జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది.అదేవిధంగా శరీరంలో రోగ నిరోధక శక్తి( Immunity ) కూడా పెరుగుతుంది.
శరీరంలో జీవక్రియల రేటు కూడా పెరుగుతుంది.అయితే ఇది తయారు చేసుకోవడానికి మనం ఉపయోగించాల్సిన పదార్థం దాల్చిన చెక్క.
సాధారణంగా దాల్చిన చెక్క ప్రతి వంటకంలో రుచిని పెంచడం కోసం వాడుతూ ఉంటారు.ఇది మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది.
ఈ దాల్చిన చెక్క టీ( Cinnamon Tea )ని తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా వేడి చేసుకోవాలి.

ఆ నీళ్లు మరిగిన తర్వాత రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసి మద్యస్థ మంటపై బాగా మరిగించాలి.ఒక పది నిమిషాల పాటు మరిగించి ఆ టీ ని వడకట్టి ఒక కప్పులోకి తీసుకోవాలి.ఇక రుచి కోసం ఈ టీ లో ఒక స్పూన్ తేనెను( Honey ) కూడా కలుపుకోవచ్చు.
ఈ విధంగా తయారు చేసుకొని ఈ టీ ని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే చాలా వేగంగా బరువు తగ్గుతారు.ఇక బరువును తగ్గాలనుకున్నవారు ఈ టీ తాగుతూనే ప్రతిరోజు నీటిని కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి.
అలాగే ప్రతిరోజు కచ్చితంగా ఒక గంట వ్యాయామం(Exercise ) చేయాలి.అలాగే పండ్లు, కూరగాయలను కూడా ఎక్కువగా తీసుకోవాలి.