మధుమేహం.దీర్ఘకాలికంగా వేధించే అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటి.
ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడుతూనే ఉండాలి.అలాగే మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా స్వీట్స్ వైపు పొరపాటున కూడా చూడకూడదు.దాంతో స్వీట్స్‌ను తినలేక, నోరును కట్టుకోలేక మధుమేహం వ్యాధి గ్రస్తులు లోలోన తెగ మదన పడిపోతూ ఉంటారు.
ఈ లిస్ట్ లో మీరు ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే స్వీట్‌ను డైట్‌లో చేర్చుకుంటే షుగర్ పెరగకుండా ఉంటుంది.అదే సమయంలో బరువు కూడా తగ్గుతారు.మరి ఇంకెందుకు లేటు మరి ఆ స్వీట్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు ఓట్స్ వేసి వేయించుకోవాలి.
ఆ తర్వాత అదే పాన్‌లో వన్ టేబుల్ స్పూన్ మెంతులు, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, పదిహేను బాదం పప్పులు, అర కప్పు పుచ్చ గింజలు, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, అర కప్పు వేరు శెనగలను విడి విడిగా వేయించుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్‌లో ఓట్స్ మినహా మిగిలిన పదార్థాలన్నిటినీ వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఈ పొడిలో వేయించి పెట్టుకున్న ఓట్స్, ఒక కప్పు బెల్లం పొడి, ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకుని లడ్డూల మాదిరి చుట్టుకోవాలి.ఈ ఓట్స్ అండ్ సీడ్స్ లడ్డూలను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి.
ఈ లడ్డూలు మధుమేహులకు బెస్ట్ అండ్ హెల్తీ స్వీట్‌గా చెప్పుకోవచ్చు.రోజుకు ఒకటి చప్పున ఈ లడ్డూలను తీసుకుంటే.తీపి తినాలన్న కోరిక తీరుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి.
వెయిట్ లాస్ అవుతారు.మరియు రక్తహీనత బారిన పడకుండా కూడా ఉంటారు.