ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.49
సూర్యాస్తమయం: సాయంత్రం 05.59
రాహుకాలం: ఉ.09.37 నుంచి 11.01 వరకు
అమృత ఘడియలు: మ.12.03 నుంచి 12.48 వరకు
దుర్ముహూర్తం: ఉ.06.49 నుంచి 11.01 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల జాగ్రత తీసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా వుంది.తొందర పడి మీ సొమ్ము ను ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు.
మీకు ఇతరుల నుండి సహాయం అందే అవకాశం ఉంది.మీ భాగస్వామితో సంతోషం గా గడపటానికి ప్రయత్నించండి.
వృషభం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.నూతన పరిచయాల వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.దీని వల్ల మీకు మనశ్శాంతి ఉంటుంది.
మిథునం:

ఈ రోజు అనుకోకుండా కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.
మీ స్నేహితులను కలుస్తారు.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ జీవితభాగస్వామి నుండి సహాయం అందుతుంది.
కర్కాటకం:

ఈ రోజు మీరు దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.మీ స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.
సింహం:

ఈ రోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల జాగ్రత్తగా ఉండాలి లేదా ఇబ్బందులెదురవుతాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
కొన్ని వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచించాలి.జీవితభాగస్వామితో సంతోషంగా గడపాలి.
కన్య:

ఈ రోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీ స్నేహితులను కలవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.
తులా:

ఈరోజు మీకు కొన్ని లాభాలు అందే అవకాశం ఉంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.
కాగా దీని గురించి చింత చెందాల్సిన పనిలేదు.అనుకోకుండా కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు చేస్తారు.
వృశ్చికం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్య కుదుటపడుతుంది.మీ స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.మీ భాగస్వామితో అనవసరంగా వాదనలకు దిగకండి
ధనస్సు:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.మీ ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఈ రోజు ఏదైనా పని మొదలు పెడితే విజయవంతంగా సాగుతోంది.దూర ప్రాంతాల నుండి శుభవార్త వింటారు.
మీ సంతానం విషయంలో భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు.మీ జీవితభాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
కుంభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకూలంగా సాగుతుంటుంది.ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ పాత స్నేహితులను కలవడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు.
మీనం:

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం ఇతరులతో అనవసరంగా వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.