ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.39
సూర్యాస్తమయం: సాయంత్రం.6.22
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: ఉ.5.55 ల6.31 ద్వాదశి మంచిది కాదు.
దుర్ముహూర్తం: మ.12.24 ల1.12
ల2.46 ల3.34
మేషం:

ఈరోజు గౌరవ మర్యాదలు పెరుగుతాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.సంఘంలో వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి.
ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ యోగమున్నది.
వృషభం:

ఈరోజు ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి.దీర్ఘకాలిక రుణభారం కొంత వరకు తీరి ఊరట చెందుతారు.నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.సకాలంలో పనులు పూర్తిచేస్తారు.గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది.వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగమున అధికారుల సహాయం అందుతుంది.
మిథునం:

ఈరోజు ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది.ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి.
ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు కలిసిరావు.వృత్తి వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి.
కర్కాటకం:

ఈరోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.మిత్రులతో మాటపట్టింపులు తప్పవు.పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.దూర ప్రయాణాల వలన విశ్రాంతి ఉండదు.ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
సింహం:

ఈరోజు స్థిరస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి.
చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుకు ప్రశంసలు పొందుతారు.
కన్య:

ఈరోజు ఆకస్మిక ధనలబ్ది పొందుతారు.చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.సన్నిహితులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు.వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి.
తుల:

ఈరోజు బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
వృశ్చికం:

ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగాలలో అధికారులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి.చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.ఆర్ధిక పురోగతి సాధిస్తారు.వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి.
ధనుస్సు:

ఈరోజు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది.నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి.
మకరం:

ఈరోజు నూతన వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ఆర్థిక వ్యవహారాలలో సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.
కుంభం:

ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.దాయదులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి.కొన్ని వ్యవహారాలలో మానసిక సమస్యలు తప్పవు.చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
మీనం:

ఈరోజు ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది.నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి.
నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి.