అప్పటికి, ఇప్పటికి మిస్టరీగానే మిగిలిపోయిన టాలీవుడ్ సెలబ్స్ మరణాలు

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు తీసి ఇక్కడ హీరోలు హీరోయిన్లు గా స్థిరపడాలంటే చాలా కష్టం ఒక్కోసారి కొందరు ఓవర్ నైట్ లో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు అవ్వచ్చు కానీ ఆ స్టార్ డమ్ ఎక్కువ రోజులు ఉండొచ్చు ఉండకపోవచ్చు.అలా స్టార్లుగా ఇండస్ట్రీలో చాలా రోజులు వెలుగొంది ఆ తర్వాత అర్థంతరంగా జీవితాన్ని మధ్యలోనే ముగించిన కొంతమంది గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వాళ్ళ మరణానికి సంబంధించిన సరైన కారణం ఏంటో ఇప్పటికీ కూడా తెలియకుండా మిస్టరీ గానే మిగిలిపోయాయి.

 Tollywood Celebs Deaths Still Mystery Since Many Years, Tollywood, Celebrities,-TeluguStop.com

సిల్క్ స్మిత

ఐటెం సాంగ్ లో ఎక్కువగా కనిపిస్తూ అందరినీ అలరించిన స్టార్ సిల్క్ స్మిత చిరంజీవి దగ్గర్నుంచి పెద్ద హీరోలందరితో ఐటెం సాంగ్ చేసిన ఐటెం భామ తను.చిరంజీవి ముఠామేస్త్రి సినిమా లో బంగారు కోడిపెట్ట వచ్చెనండి ఏ పాపా ఏ పాపా అనే సాంగ్ లో చిరంజీవితో ఆడిపాడిన ఈ ఐటం భామ ఆ పాటతో మంచి గుర్తింపును సాధించింది.అలాంటి సిల్క్ స్మిత ఆస్తులన్నింటినీ కోల్పోయి అప్పుల బాధ భరించలేక సూసైడ్ చేసుకుని చనిపోయింది అని అనుకుంటున్నారు తప్ప అసలు కారణం ఏంటో ఎవరికీ తెలీదు.

దివ్యభారతి

Telugu Divya Bharathi, Prathyusha, Silk Smitha, Tollywood, Uday Kiran-Telugu Sto

వెంకటేష్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన బొబ్బిలి రాజా సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ఆ సినిమాతో మంచి పేరు సంపాదించింది ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రౌడీ అల్లుడు సినిమాలో నటించి తన నటనతో జనాల్ని మెస్మరైజ్ చేసింది.అయితే మంచి స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రోజుల్లో తను సాజిద్ నదియా వాలాని పెళ్లి చేసుకున్నారు.

అయితే ఒకరోజు బాగా తాగిన దివ్యభారతి తాగిన మత్తులో ఏడంతస్తుల మేడ మీద నుంచి పడిపోయింది అని చాలామంది అంటూ ఉంటారు కానీ వాళ్ల సన్నిహితులు మాత్రం వీరిద్దరూ పెళ్లయినప్పటి నుంచి సరిగా కాపురం చేయట్లేదు అని తన భర్తనే తనని మేడ మీద నుంచి తోసేసాడు అని చెప్తుంటారు.

ప్రత్యూష

Telugu Divya Bharathi, Prathyusha, Silk Smitha, Tollywood, Uday Kiran-Telugu Sto

ఒక మంచి తెలుగు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుందామని తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అమ్మాయి ప్రత్యూష.రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా వచ్చిన రాయుడు సినిమా లో మోహన్ బాబు కూతురు పాత్ర చేసింది.ఆ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష ఆ తర్వాత హీరోయిన్ గా మారి ఉదయ కిరణ్ హీరోగా వచ్చిన కలుసుకోవాలని సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది.

అయితే కొంతమంది కలిసి ఆవిడ ని రేప్ చేసి చంపేశారు కానీ అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ అమ్మాయి కి సంబంధించిన ఒక్క సాక్షాన్ని కూడా బయటికి రాకుండా చేయడంతో ప్రత్యూష ఎలా చనిపోయింది అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

ఉదయ్ కిరణ్

Telugu Divya Bharathi, Prathyusha, Silk Smitha, Tollywood, Uday Kiran-Telugu Sto

ఉదయ్ కిరణ్ లైఫ్ లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు వాళ్ళ అమ్మ యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు అయితే సినిమాల్లోకి వచ్చిన ఉదయ కిరణ్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు.దాంతో చిరంజీవి లాంటి పెద్ద హీరో తన కూతుర్ ని ఉదయ్ కిరణ్ కి ఇచ్చి పెళ్లి చేస్తాను అని ఓపెన్ గా అనౌన్స్ చేశాడు.తర్వాత కొన్ని కారణాల వల్ల ఉదయ్ కిరణ్ చిరంజీవి కూతురు నీ పెళ్లి చేసుకోలేదు దాంతో ఉదయ్ కిరణ్ కు వచ్చిన మూవీ ఛాన్స్ లు అన్ని వెనక్కి వెళ్ళిపోయాయి చిరంజీవి బెదిరిస్తేనే ఉదయ్ కిరణ్ సినిమా ఛాన్స్ లన్ని మిస్ అయ్యానని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఉదయ్ కిరణ్ కి సినిమా ఛాన్సులు లేక చేసిన సినిమాలతో పెద్దగా ఉపయోగం లేక మానసికంగా క్రుంగిపోయిన ఉదయ్ కిరణ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు దీనికి కారణం ఇదేనా లేకపోతే ఫ్యామిలీకి సంబంధించి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఎవరికీ తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube