టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య( Nandamuri Balayya ) క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.తాజాగా బాలయ్యకు పద్మభూషణ్ అవార్డును( Padma Bhushan ) ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈరోజు బాలయ్యకు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో( Basavatarakam Cancer Hospital ) సన్మానం చేసిన సంగతి తెలిసిందే.బాలయ్య మాట్లాడుతూ నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో మన బాధ్యత మనం నిర్వర్తించాలని బాలయ్య కామెంట్లు చేశారు.
బిరుదుల కోసం కాదని మనకెంతో ఇచ్చిన సమాజానికి మనం ఏద్రైనా తిరిగి ఇవ్వాలని బాలయ్య పేర్కొన్నారు.సమాజానికి ఉపయోగపడితే మనం ఏదైనా సాధించవచ్చని బాలయ్య వెల్లడించారు.నాకు పద్మ భూషణ్ ఎప్పుడో రావాల్సిందని చాలామంది అంటున్నారని బాలయ్య పేర్కొన్నారు.నేను ఎప్పుడూ అధ్యాత్మిక చింతనలో ఉంటానని పూజలు ఎక్కువగా చేస్తానని బాలయ్య కామెంట్లు చేశారు.

పనే నాకు దైవం అని నాన్న గారి వందో జయంతి ఇటీవలే పూర్తైందని బాలయ్య తెలిపారు.సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) నటించిన మన దేశం( Mana Desam ) విడుదలై 75 సంవత్సరాలు అయిందని బాలయ్య కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.తాను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచానని నేను నటించిన నాలుగు సినిమాలు వరుసగా హిట్లుగా నిలిచాయని బాలయ్య చెప్పుకొచ్చారు.

కళామతల్లి ఆశిస్సులతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టానని బాలయ్య పేర్కొన్నారు.బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.బాలయ్య రెమ్యునరేషన్ ప్రస్తుతం 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా సత్తా చాటుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.బాలయ్య ఇతర భాషల్లో సైతం సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తుండగా బాలయ్యకు 2025 సంవత్సరం మరింత కలిసిరావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఈ ఏడాది అఖండ2( Akhanda 2 ) సినిమాతో బాలయ్య లక్ పరీక్షించుకున్నారు.బాలయ్యకు క్రేజ్ ఊహించని స్థాయిలో అంతకంతకూ పెరుగుతోంది.