చలికాలం స్టార్ట్ అయిపోయింది.ఈ సీజన్ లో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
లేదంటే జలుబు,( Cold ) దగ్గు, ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటాయి.అలాగే చర్మ, కేశ సమస్యలు కూడా ఈ సీజన్ లో కాస్త ఎక్కువగానే ఉంటాయి.
అందుకే హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల పండ్లను ప్రస్తుత ఈ చలికాలంలో కచ్చితంగా తీసుకోవాలి.
మరి ఇంతకీ ఆ ఐదు రకాల పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరెంజ్.
వింటర్ సీజన్ లో తప్పకుండా తీసుకోవాల్సిన పండ్లలో ఒకటి.ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
రోజుకు ఒక ఆరెంజ్ ను తీసుకుంటే ఇమ్యూనిటీ ( Immunity )పవర్ పెరుగుతుంది.సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
ఆరెంజ్ లో ఉండే పలు పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

శీతాకాలంలో డైట్ లో చేర్చుకోవాల్సిన మరొక ఫ్రూట్ యాపిల్.( Apple ) యాపిల్ పండు జీర్ణ వ్యవస్థను చురుగ్గా మారుస్తుంది.డయాబెటిస్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది.
అధిక కొలెస్ట్రాల్ ను సైతం కలిగిస్తుంది.అలాగే వింటర్ సీజన్ లో ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో కివి ఒకటి.
కివి ఫ్రూట్ లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ రిచ్ గా ఉంటాయి.రోజుకు ఒక కివి పండు తింటే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
నిద్ర బాగా పడుతుంది.స్కిన్ గ్లోయింగ్ గా మెరుస్తుంది.
హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.

చలికాలంలో దానిమ్మ పండును ( pomegranate )కూడా డైట్ లో చేర్చుకోవాలి.దానిమ్మ పండు రక్తహీనతను( Anemia ) దూరం చేస్తుంది.దానిమ్మలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటాయి.
మరియు దానిమ్మ గుండె పోటు వచ్చే రిస్క్ ను సైతం తగ్గిస్తుంది.ఇక వింటర్ లో ఫైనాపిల్ ను కూడా కచ్చితంగా తీసుకోవాలి.పైనాపిల్ మన బాడీ వెయిట్ ను కంట్రోల్ చేస్తుంది.ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అయ్యేలా ప్రోత్సహిస్తుంది.
ఎముకలను దృఢంగా మారుస్తుంది.మరియు స్కిన్ హెల్త్ ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది.