రామానాయుడు ( Ramanaidu ).తెలుగు సినిమా నిర్మాతగా, రామ నాయుడు స్టూడియో అధినేతగా సినిమా ఇండస్ట్రీ కి ఎంతో సేవ చేసారు.
పద్మ భూషణ్ అవార్డు అందుకొని టాలీవుడ్ కి మకుటం లేని మహారాజు గా చాల సినిమాలు తీశారు.అయితే కేవలం సినిమాలు మాత్రమే కాదు ఎన్టీఆర్ మూలంగా రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసారు.బాపట్ల నియోజక వర్గం ( Bapatla Constituency )నుంచి పార్లమెంట్ సభ్యుడిగా 1999 నుంచి 2004 వరకు ఒక సారి మాత్రమే పని చేసారు.2004 లో రెండోసారి గెలుస్తారు అనుకుంటే అది సాధ్యం కాకపోవడం తో రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నారు.

మొదటి నుంచి ఎన్టీఆర్( NTR ) కారణంగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ క్రియాశీలక రాజకీయాలు చేసింది మాత్రం అన్నగారు ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాతే.ఎన్టీఆర్ ని గద్దె దించి, అయన మరణానికి కారణం అయినా చంద్ర బాబు ఆ పాపప్రక్షాళన కోసం గ్లామర్ ఫీల్డ్ ని బాగా ఎంకరేజ్ చేసారు.అప్పట్లో అగ్రశ్రేణి వారిని ఎంచుకొని వారికి అన్ని రకాలుగా సహాయం చేసారు .ఇక రామానాయుడు కి రాజాజీయం ఎలా ఉంటుందో ఒక్కసారి ఎంపీ పని చేయగానే అర్ధం అయిపొయింది .ఈ రాజకీయాలు మనకు సరిపోయేవి కావు అని కూడా అనుకున్నారట.ఇక బాహాటంగానే చంద్ర బాబు పై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు.

ఒకసారి అయన పై రాసిన బుక్ ని చంద్ర బాబు చేతుల మీదుగా ఆవిష్కరణ చేయాలి రామానాయుడు అనుకున్నారు.అప్పుడు బాబు ముఖ్యమంత్రి గా ఉన్నారు.బాబు ఒకే ఆనందం తో ఫిలిం జర్నలిస్ట్ వర్గాన్ని మొత్తం వెంట బెట్టుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చేరుకున్నారు.కానీ మార్గ మధ్యలోనే కారులో పుస్తకాన్ని ఆవిష్కరించి రామానాయుడు మనసు నొచ్చుకునేలా చేసాడు బాబు.
దాంతో ఇంతోటి దానికి ఇక్కడి వరకు రప్పించడం ఎందుకు స్టూడియో లోనే పని కానిచ్చేవారము కదా అంటూ రిపోర్టర్స్ ముందే బాబు ని గట్టిగా అనేసారట.ఈ విషయం ఆ నోటా ఈ నోటా పెద్దల వరకు వెళ్ళింది.
ఆ తర్వాత దఫా రామానాయుడు బాపట్లలో ఓడిపోవడం కూడా జరిగిపోయింది.