ఈ మ్యాజికల్ ఆయిల్ ను వాడితే ఎలాంటి జుట్టు సమస్యలు అయినా పరార్ అవ్వాల్సిందే!

హెయిర్ ఫాల్( Hair Fall ) కోట్లాది మందిని సర్వసాధారణంగా వేధించే సమస్య ఇది.అలాగే చుండ్రు, జుట్టు చివర్లు చిట్లి పోవడం, విరగడం, కురులు త్వరగా తెల్లబడటం వంటి సమస్యలు కూడా కామన్ గా ఇబ్బంది పెట్టేవే.

 Magical Oil For Healthy Black Thick Shiny Hair!, Magical Oil, Hair Oil, Latest N-TeluguStop.com

అయితే సమస్య ఏదైనా సరే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ ను కనుక వాడితే పరార్ అవ్వాల్సిందే.ఈ ఆయిల్ తో ఎలాంటి కేశ సంబంధిత సమస్యను అయినా సుల‌భంగా వదిలించుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Black, Dandruff, Care, Oil, Healthy, Latest, Magical Oil, Shiny, Fall, Th

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కరివేపాకు( Curry Leaves ) వేసి గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు కొబ్బరి నూనెను పోయాలి.ఆయిల్ హీట్ అవ్వడానికి ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు మిశ్రమాన్ని వేసుకోవాలి.

అలాగే ఐదు నుంచి ఆరు పొట్టు తొలగించి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి చిన్న మంటపై కనీసం ప‌న్నెండు నిమిషాల పాటు ఆయిల్ ను మరిగించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ చల్లారేంత వరకు వదిలేయాలి.

కంప్లీట్ గా కూల్ అయిన అనంతరం స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి కాసేపు మసాజ్ చేసుకోవాలి.

ఆయిల్ అప్లై చేసిన మరుసటి రోజు మైల్డ్ షాంపూ యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.

Telugu Black, Dandruff, Care, Oil, Healthy, Latest, Magical Oil, Shiny, Fall, Th

వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే జుట్టు రాలడం క్రమంగా తగ్గిపోతుంది.కురులు దృఢంగా మారతాయి.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.కురులు త్వరగా తెల్లబడకుండా( Grey Hair ) ఉంటాయి.

చుండ్రు సమస్య( Dandruff ) ఉంటే తగ్గు ముఖం పడుతుంది.మరియు జుట్టు స్మూత్ అండ్ షైనీ గా సైతం మెరుస్తుంది.

కాబట్టి ఆరోగ్యమైన ఒత్తైన నల్లని మెరిసే కురులను కోరుకునే వారు తప్పకుండా ఈ మ్యాజికల్ ఆయిల్ ను వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube