గులాబీ వాసన,అందానికి దాసోహం అవని వారు ఎవరు లేరు.గులాబీ కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలను కలిగిస్తుంది.
గులాబి పూలతో తయారుచేసిన టీని త్రాగితే మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.అలాంటి గులాబి టీని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
ఒక కప్పు నీటిలో గులాబి రేకులను వేసి బాగా మరిగించాలి.సుమారుగా 20 నిమిషాల పాటు మరిగించాలి.
ఆ నీటిని వడకట్టి కొంచెం తేనే,నిమ్మరసం కలుపుకొని త్రాగాలి.ఇప్పుడు గులాబి టీ త్రాగటం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.
ప్రతి రోజు గులాబి టీ త్రాగటం వలన చర్మం మీద మొటిమలు,మచ్చలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారటమే కాకుండా చర్మంలోని వ్యర్ధ పదార్ధాలు బయటకు పోతాయి.
గులాబీ టీలో యాంటీ బయోటిక్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
మహిళలు గులాబీ పువ్వుల టీని తాగితే నెలసరి సరిగ్గా రావటమే కాకుండా ఆ సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
జీర్ణశక్తి పెరిగి అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.
గులాబీ టీని ప్రతి రోజు త్రాగుతూ ఉంటె ఒత్తిడి, ఆందోళన దూరం అయ్యి మానసిక ప్రశాంతత కలుగుతుంది.దాంతో బరువు తగ్గే అవకాశం కూడా ఉంది.