ఇప్పటి వరకు ఇండియన్ సినిమా పరిశ్రమ అనగానే బాలీవుడ్ మాత్రమే అనుకునే వారు.అక్కడ రూపుదిద్దుకున్న సినిమాలే దేశంలో బాగా పేరు సంపాదించుకునేవి.
అయితే నెమ్మదిగా ఆ పరిస్థితి మారుతోంది.బాలీవుడ్ ను తలదన్నేలా టాలీవుడ్ సినిమాలు రూపొందుతున్నాయి.
ఇప్పటి వరకు కొనసాగుతున్న నార్త్ సినిమాల డామినేషన్ నెమ్మదిగా తగ్గిపోతుంది.ప్రస్తుతం హిందీ సినిమా పరిశ్రమకు తెలుగు సినిమా పరిశ్రమ చెమటలు పట్టిస్తోంది.
బాహుబలి సినిమా వరకు తెలుగు సినిమా పరిశ్రమ ఉందంటే..
ఉంది అన్నట్లుగానే చూసేవారు.కానీ తెలుగు సినిమా పరిశ్రమ ఇండియన్ సినిమా పరిశ్రమను ఏలుతుందని ఎవరూ భావించి ఉండరు.
బాహుబలి సినిమాతో బాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టిన తెలుగు సినిమా ఆ తర్వాత కూడా సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తుంది.బాహుబలితో పాటు లేటెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ పుష్ప కూడా బాలీవుడ్ లో ఫుల్ సక్సెస్ అయ్యింది.
పుష్ప దెబ్బకు బాలీవుడ్ సినిమాలు చతికిలపడ్డాయి.అయితే మున్ముందు రాబోతున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్, ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలతో ఇంకా ఎన్ని ఇబ్బందులు వస్తాయోనని వర్రీ అవుతున్నారు.
తెలుగు సినిమాల మూలంగా గంగూ భాయ్ లాంటి బాలీవుడ్ సినిమాలు సైతం పోస్ట్ పోన్ అవుతున్నాయి.తెలుగు సినిమాలు విడుదల మూలంగా ఆ దరిదాపుల్లో కూడా రిలీజ్ లు పెట్టుకోవద్దని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారు.
త్రిఫుల్ ఆర్ ఎఫెక్ట్ బాలీవుడ్ కు గట్టిగానే తగిలే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.
తెలుగు సినిమాల కారణంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.ట్రిపుల్ఆర్ రిలీజ్ అయిన తర్వాత 4 నెలల వరకూ ఏ సినిమాని రిలీజ్ చెయ్యద్దని మిగతా వారిని అలర్ట్ చేసే స్థాయికి చేరింది.ఓ వైపు బాలీవుడ్ ను తెలుగు సినిమా రంగం డామినేట్ చేస్తుంటే.
మరోవైపు హాలీవుడ్ చూపు కూడా పడింది.తాజాగా రిలీజ్ అయిన 83, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాయి.