ఒక్క మచ్చ కూడా లేకుండా ముఖ చర్మం అందంగా కాంతివంతంగా మెరిసిపోవాలని కోరుకుంటున్నారా.? అటువంటి స్కిన్ ను సొంతం చేసుకునేందుకు ఖరీదైన క్రీములను కొనుగోలు చేసి వాడుతున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకోసమే.మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన క్రీములు కట్టే ఎఫెక్టివ్ గా ఈ రెమెడీ పని చేస్తుంది.
పైగా దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ రెమెడీ ( Home remedy )గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో గుప్పెడు వేపాకులు( Neem leaves ), పది ఫ్రెష్ తులసి ఆకులు( Basil leaves ), నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose water ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి, పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు మరియు వన్ టేబుల్ స్పూన్ అలోవెరా వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.వారానికి రెండు లేదా మూడుసార్లు ఈ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే చాలా స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.