ప్రస్తుత వేసవికాలంలో( summer ) అత్యంత కామన్ గా ఇబ్బంది పెట్టే సమస్యల్లో నీరసం ఒకటి.మండే ఎండలు, అధిక వేడి కారణంగా ఒంట్లో నీరు మొత్తం ఆవిరై నీరసంగా, అలసటగా అనిపించవచ్చు.
అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే రాగి డ్రింక్ ను కనుక తీసుకుంటే నీరసానికి బై బై చెప్పవచ్చు.వేసవి తాపం నుంచి విముక్తి పొందవచ్చు.
మరి ఇంతకీ ఆ రాగి డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పది బాదం గింజలు( Almonds ) మరియు ఒక కప్పు హాట్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి.
అలాగే మరొక గిన్నెలో వన్ టీ స్పూన్ సబ్జా గింజలు ( Sabja seeds )మరియు వాటర్ పోసి నానబెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ బాగా బాయిల్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్లు రాగి పిండిని వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉడికించాలి.పిండి దగ్గర పడేంతవరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
కొద్దిగా చల్లారిన తర్వాత ఈ రాగి పిండిని మిక్సీ జార్ లో వేసుకోవాలి.

అలాగే నానబెట్టి పొట్టు తొలగించిన బాదం గింజలు, అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు( Raw coconut flakes ), నాలుగు మంచి ఐదు టేబుల్ స్పూన్లు బెల్లం తురుము( jaggery powder ), పావు టీ స్పూన్ యాలకుల పొడి మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.ఆపై స్ట్రైనర్ సహాయంతో రాగి డ్రింక్ ను ఫిల్టర్ చేసుకుని సబ్జా గింజలు మరియు ఐస్ క్యూబ్స్ కలిపి తాగేయడమే.

ప్రస్తుత వేసవికాలంలో ఆరోగ్యానికి ఈ రాగి డ్రింక్ అండగా ఉంటుంది.వేసవి తాపాన్ని దూరం చేస్తుంది.బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది.
అలాగే ఈ రాగి డ్రింక్ నీరసం, అలసటను తరిమికొడుతుంది.శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
మిమ్మల్ని ఫుల్ ఎనర్జిటిక్ గా మారుస్తుంది.అంతే కాదండోయ్ ఈ రాగి డ్రింక్ ఎముకలను బలోపేతం చేయడంలో, రక్తహీనత సమస్యకు చెక్ పెట్టడంలో మరియు డిహైడ్రేషన్ బారిన పడకుండా రక్షించడంలోనూ అద్భుతంగా సహాయపడుతుంది.