ఈ మధ్యకాలంలో హిట్ అయిన సినిమాలు సెలెబ్రెటీల పుట్టినరోజు లేదా హీరోల ప్రత్యేకమైన రోజుల్లో మరోసారి విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది.అలా మళ్లీ విడుదలవుతున్న సినిమాలు కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించడం నిజంగా విశేషమని చెప్పాలి.
పైగా ఈ రికార్డు స్థాయి కలెక్షన్స్ పూర్తిగా అభిమానుల వల్లే సాధ్యమవుతుంది.అభిమానులు తమ అభిమాన హీరోకి ఇస్తున్న గిఫ్ట్ గా భావిస్తున్నారు.
అందుకే ఎన్నిసార్లు టీవీలో వచ్చిన కూడా మళ్లి రికార్డు స్థాయిలో థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం అనేది నిజంగా ఒక గొప్ప పరిణామమే.మరి అలా ఇండస్ట్రీలో మరోసారి విడుదల అయ్యి రికార్డు స్థాయి కలెక్షన్స్ అందుకున్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
ఖుషి
పవన్ కళ్యాణ్, భూమిక ( Pawan Kalyan, Bhumika )హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ఎస్ జె సూర్య( SJ Surya ) దర్శకత్వంలో వచ్చి మొదటిసారి ఘనవిజయం సాధించింది.ఆ సినిమా ప్రభావం ఎంతలా ఉందంటే ఆ తర్వాత దాదాపు పది సినిమాల పాటు పవన్ కళ్యాణ్ కి హిట్టు దక్కలేదు.అయితే ఈ సినిమా మరోసారి విడుదలవగా దాదాపు 4.2 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.
సింహాద్రి

జూనియర్ ఎన్టీఆర్, భూమిక( NTR, Bhumika ) హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం కూడా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది, అయితే మొన్నటికి మొన్న మరోసారి విడుదల చేయగా ఈ చిత్రం దాదాపు 4.1 కోట్ల రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టింది.
జల్సా

పవన్ కళ్యాణ్, ఇలియానా( Pawan Kalyan, Ileana ) హీరో హీరోయిన్స్ గా నటించిన జల్సా సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం అందించారు.వీరిద్దరి కాంబినేషన్ అంటేనే జనాలు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమా రెండవ సారి విడుదలవగా 3.2 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించడం విశేషం.
ఒక్కడు

గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు చిత్రంలో మహేష్ బాబు, భూమిక ( Mahesh Babu, Bhumika )హీరో హీరోయిన్స్ గా నటించారు.ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లో ఒక గొప్ప చిత్రం గా చెప్పుకోవచ్చు.ఈ చిత్రాన్ని జనవరిలో మరోమారు విడుదల చేయగా 2.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది.పైన చెప్పిన నాలుగు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే జల్సా సినిమా కు మినహా మిగతా మూడు చిత్రాల్లో భూమిక హీరోయిన్ గా నటించింది.
ఇక ఖుషి సినిమా అప్పటికి ఇప్పటికీ రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించడం విశేషం.