హీరో హీరోయిన్లు విలన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా చెప్పుకుంటూ పోతే కనిపించే ప్రతి ఒక్కరిని వదలకుండా నెటిజన్లు ఎప్పుడూ ఏదో ఒక గాసిప్ వైరల్ గా మార్చేస్తూ ఉంటారు అని చెప్పాలి.గాసిప్స్ పుణ్యమా అని నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న వార్తల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని విధంగా మారిపోయింది పరిస్థితి.
అయితే మొన్నటి వరకు కేవలం సినీ సెలబ్రిటీల సినిమాలు అప్డేట్ గురించి మాత్రమే గాసిప్స్ బయటకు వచ్చేవి.ఈ హీరో ఆ హీరోయిన్ తో సినిమా చేస్తున్నాడు అంటూ ఎన్నో పుకార్లు పుట్టుకు వచ్చేవి.
కానీ ఇప్పుడు మాత్రం ఈ గ్రాఫిక్స్ పర్సనల్ లైఫ్ లోకి కూడా దూరిపోతున్నాయ్.పెళ్లి ప్రేమ విడాకులు అంటూ అన్ని గాసిప్స్ సృష్టించే వాళ్లే డిసైడ్ చేస్తున్నారు.
ఇలా ఇటీవలి కాలంలో సినీ సెలబ్రిటీల పై వస్తున్న రూమర్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న రామ్ పోతినేని ఎన్నో ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.
ఏ హీరోయిన్ తో లవ్ ఎఫైర్ కానీ లేదు.కాగా ఇటీవల అతని పెళ్లి గురించిన వార్త ఒకటి మారిపోయింది.
రామ్ పోతినేని తన చిన్నప్పటి ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని అది కూడా సీక్రెట్ గా జరిగిపోతుంది అంటూ ఒక గాసిప్ తెరమీదికి వచ్చింది.ఈ గాసిప్ ఎంతలా వైరల్ గా మారి పోయింది.
అంటే ఏకంగా హీరో రామ్ తన కుటుంబ సభ్యులకు నేను ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదు అని సమాధానం చెప్పుకునే పరిస్థితి తీసుకు వచ్చింది.చివరికి ఇటీవలే అందరికీ క్లారిటీ వచ్చేసింది.
మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవలే ఆమె రెమ్యూనరేషన్ తో పాటు తన స్టాఫ్ 20 మంది కూడా డబ్బులు చెల్లించాలంటూ నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తుస్తుందని.అయితే ఇటీవల ఓ నిర్మాత అన్ని బిల్స్ పూజ హెగ్డేకు పంపించాడు అంటూ వార్తలు వచ్చాయి.కానీ పూజా హెగ్డే వీటి గురించి ఇప్పటివరకూ ఏమీ స్పందించలేదు.
రష్మిక ను కూడా ఇలా గాసిప్ సృష్టించేవారు వదల్లేదు.ప్రస్తుతం బాలీవుడ్లో మిస్టర్ మజ్ను సినిమాలో నటిస్తోంది ఈ అమ్మడు.తనతో పాటు తన పెట్ డాగ్ ని కోసం ప్రత్యేకమైన ఫ్లైట్ టికెట్ కొనాలని నిర్మాతలకు ఇబ్బందులు పెట్టినట్లు రూమర్స్ వచ్చాయి.
రూమర్స్ పై స్పందించిన రష్మిక మందన పూర్తి క్లారిటీ ఇచ్చేసి అలాంటిదేమీ లేదు అంటూ తేల్చి చెప్పింది.
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు నరేష్,పవిత్ర లోకేష్ వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సహజీవనం చేస్తున్నారని ఒక వార్త టాలీవుడ్ ను ఊపిసింది.అయితే దీనిపై సీరియస్గానే స్పందించారు నరేష్.అదంతా అసత్యం అంటూ చెబితే ఏకంగా పవిత్ర లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక స్టార్ సింగర్ హేమచంద్ర ఆయన భార్య శ్రావణ భార్గవి విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.నిజమే అనుకున్నారు అందరు.కానీ ఇటీవలే మీలాగా టైం వేస్ట్ చేసే సమయం మా దగ్గర లేదని మేము కలిసి ఉన్నాము అంటూ క్లారిటీ ఇచ్చారు.