గాల్లో తేలుతూ నది దాటిన కోడి.. వీడియో చూస్తే అద్భుతం అంటారంతే..

ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది, దాన్ని చూసినోళ్లంతా అవాక్కవుతున్నారు, నమ్మలేకపోతున్నారు.అసలు విషయం ఏంటంటే, ఒక కోడిపుంజు నదిని (Kodipunju River)ఈదుకుంటూ కాదు, ఏకంగా గాల్లోనే ఎగురుకుంటూ దాటేసింది.

 A Chicken Floating In The Air Across A River.. The Video Is Amazing.., Flying Ch-TeluguStop.com

నమ్మశక్యంగా లేదు కదూ కానీ వీడియోలో నిజంగానే ఉంది మరి.

ఆ వీడియోలో ఒక తెల్ల కోడిపుంజు(chicken) ఒక చిన్న బ్రిడ్జి లాంటి దాని మీద నిలబడి ఉంది.ఆ తర్వాత ఒక్కసారిగా రెక్కలు విప్పింది.అనంతరం ఇక ఆగలేదు.నీళ్ల మీద నుంచి అలా గాల్లోకి లేచి అవలీలగా నదిని దాటేసింది.అలా గాల్లో తేలుతూ అవతలి ఒడ్డుకు క్షేమంగా చేరుకుంది.

ఈ సీన్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.కోళ్లు ఇంత దూరం ఎగురుతాయా అని ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. X (ట్విట్టర్)(X (Twitter)) లోనే ఏకంగా 50 లక్షల వ్యూస్ కొట్టేసింది, 45 వేలకు పైగా లైకులు వచ్చాయి.

కోడిపుంజు అంత దూరం ఆగకుండా ఎలా ఎగిరిందో అని జనాలు నోరెళ్లబెడుతున్నారు.సోషల్ మీడియా యూజర్లు అయితే రకరకాల కామెంట్లతో రెచ్చిపోతున్నారు.నమ్మలేకపోతూనే ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.ఒక నెటిజన్ అయితే, “కోడి అంత దూరం ఎలా ఎగురుతుంది? ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు.” అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.మరొకరు కాస్త ఫన్నీగా, “ఈ కోడి నాకంటే తెలివైనది.

నాకంటే 90% మంది తెలివైనది ఈ కోడే” అని కామెంట్ పెట్టాడు.

ఇంకొక నెటిజన్ అయితే మరింత ఫన్నీగా, “అంటే ఇన్నాళ్లూ కోళ్లు నటించాయా? మనల్ని అందరినీ ఫూల్స్ చేశాయన్నమాట.” అని నవ్వుతూ కామెంట్ చేశాడు.ఈ వీడియో ఇంకా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది.

చాలామంది ఇప్పుడు ఒకటే అనుకుంటున్నారు.కోళ్లు ఇంతకాలం తమ అసలు ఎగిరే టాలెంట్ ని దాచిపెట్టాయా ఏంటి అని.దీన్ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube