చాలామంది తరచుగా ఆలయానికి( Temple ) వెళ్లి పూజలు చేసుకుని తిరిగి వచ్చే సమయంలో ప్రధాన ద్వారం దగ్గర గంట ( Temple Bell ) చూస్తారు.ఇక గుడికి వెళ్ళిన ప్రతి సారి వెళ్ళినప్పుడల్లా ఒక్కసారి అయినా గంట కొడతారు.
సాధారణంగా మనం ఆలయంలో ప్రవేశించిన సమయంలో గంట మోగించి ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వెళ్తాము.అయితే గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు కూడా గంట కొట్టడం( Ringing Bell ) తప్పనిసరి అని చాలామందికి తెలిసి ఉండదు.
అయితే గంట మోగించడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవడం కూడా చాలా అవసరం.అయితే గుడి నుండి బయటకు వెళ్లే సమయంలో గంట ఎందుకు మోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే గుడిలోకి ప్రవేశించేటప్పుడు ఆలయం గంట మోగించడం గుడిలోకి ప్రవేశించడానికి అనుమతి కోరుతున్నట్టు సంకేతం.ఇక మనం గుడిలో గంటను మోగించినప్పుడు గంట శబ్దం మన మనసు, మెదడు అన్ని చక్రాలను క్రియాశీలం చేస్తుంది.అంతే కాకుండా దేవతలందరూ మన వైపు ఆకర్షితులవుతారు.అలాగే గంట మోగించడం వలన మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయి.చుట్టూ పాజిటివ్ ఎనర్జీలు( Positive Energy ) తరంగాలను పెంచుతుంది.ఇక మనం గంట మోగించడం వలన భగవంతులు సంతోషిస్తారు.
ఈ కారణంగానే మనం గుడిలోకి ప్రవేశించినప్పుడు, ఆలయం నుంచి తిరిగి వచ్చేటప్పుడు గంట మోగించాలి.గంట మోగిస్తే దేవుడు మెల్కుంటాడు.అందుకే భగవంతుడిని మేల్కొలిపి మన చిత్తాన్ని భగవంతునిపై నిమర్జనం చేయడం వలన వారందరూ త్వరలోనే భగవంతుడిని చేరుకుంటారు.ఇక ఆలయంలోకి ప్రవేశించే ముందు గంటను మోగించడం వలన శరీరం, మనసు స్వచ్ఛంగా ఉంటుంది.
ఇక గుడి నుండి బయలుదేరే ముందు గంటను మోగిస్తే మీ సందేశం నేరుగా దేవునికి చేరుతుంది.దీంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి.