భక్తులు ఆంజనేయ స్వామి( Hanuman )ని మంగళవారం, శనివారం రోజులలో దేవాలయానికి వెళ్లి పూజిస్తూ ఉంటారు.అయితే చాలామంది హనుమంతుడి దేవాలయంలో ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలన్న సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పారంటే ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రదక్షిణలు చేయాలని సంకల్పిస్తే తను దేవాలయానికి వస్తున్నానని స్వామివారికి నివేదించుకోవాలి అని పండితులు చెబుతున్నారు.ప్రదక్షిణాలు దోషం లేకుండా పూర్తి చేసేలా దీవించమని మనసులు కోరుకోవాలి.
హనుమంతుడికి 108 ప్రదక్షిణలు చేయాలి.ఒక్కో ప్రదక్షిణను పువ్వులు( Flowers ) లేదా ఒక్కల తో లెక్కించాలి.
అంతేగాని ఏది పడితే దానితో అసలు లెక్కించకూడదు.ఒక్కలైతే ఒక డబ్బాలో వాటిని ఉంచి ఖాళీ డబ్బా లో వేస్తూ ఉండాలి.పువ్వులైతే ఒక్కొక్కటి ధ్వజస్తంభం వద్ద పెడితే సరిపోతుందని పండితులు చెబుతున్నారు.ఒకవేళ 108 ప్రదక్షిణాలు చేసేందుకు మీ శరీరం సహకరించని పక్షంలో కనీసం 54 ప్రదక్షిణాలైన చేయాలి.
అందుకు కూడా వీలుకాకపోతే అందులో సగం అంటే 27 ప్రదక్షిణలు చేసిన సరిపోతుంది.చివరికి అది కూడా వీలు కాకపోతే 11 ప్రదక్షిణలు చేస్తే చాలు.
ఇవి కూడా వీలు కానీ వారు చిట్టచివరిగా ఐదు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందని పండితులు చెబుతున్నారు.
![Telugu Brahma, Devotional, Flowers, Hanuman, Hanuman Temple, Puranas, Vishnu-Lat Telugu Brahma, Devotional, Flowers, Hanuman, Hanuman Temple, Puranas, Vishnu-Lat](https://telugustop.com/wp-content/uploads/2023/06/Hanuman-Flowers-hanuman-temple-devotional.jpg)
అందుకు కూడా శరీరం సహకరించలేని వారు మూడు ప్రదక్షిణాలు లేదా ఒక ప్రదక్షిణ చేయాలి.చేయలేననుకుంటే ప్రార్థనా శ్లోకం చెప్పాలి.ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున తప్పకుండా దేవాలయానికి వెళ్లి 108 ప్రదక్షిణలు చేయాలని పండితులు చెబుతున్నారు.స్వామివారికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఈ శ్లోకం చదవాలి.“ఆంజనేయం మహావీరం” “బ్రహ్మవిష్ణు శివాత్మకం” “తరుణార్కం ప్రభం శాంతం” “ఆంజనేయం నమామ్యహం” అనే శ్లోకం చదువుతూ 108 సార్లు ప్రదక్షిణ చేయాలి.
![Telugu Brahma, Devotional, Flowers, Hanuman, Hanuman Temple, Puranas, Vishnu-Lat Telugu Brahma, Devotional, Flowers, Hanuman, Hanuman Temple, Puranas, Vishnu-Lat](https://telugustop.com/wp-content/uploads/2023/06/Hanuman-Puranas-Flowers-hanuman-temple-devotional.jpg)
ఒక ప్రదక్షిణ పూర్తయ్యాక ఈ శ్లోకం చదవాలి.అలా ప్రతి ప్రదక్షిణ పూర్తయ్యాక స్వామివారి ముందుకు వచ్చినప్పుడు ఈ శ్లోకం చదవాలి.స్వామికి ప్రదక్షిణలు చేస్తే ఆయన అనుగ్రహంతో పాటు మనసులోని మంచి మంచి కోరికలు తీరుస్తాడని పురాణాల( Puranas )లో ఉంది.ఈ ప్రదక్షిణలు చేయడానికి హనుమంతుడు ఎలాంటి రోగాలనైన దూరం చేస్తాడని చెబుతున్నారు.
DEVOTIONAL