రాజన్న భక్తులకు ప్రతి సంవత్సరం తప్పని ఇక్కట్లు..

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న దేవాలయంలో భక్తుల సదుపాయాల కోసం ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.మహాశివరాత్రి జాతరను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఒకటిన్నర నుంచి మూడు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు.

 Temporary Arrangements Are Being Made For Vemulawada Rajanna Temple Devotees Det-TeluguStop.com

అయినా కూడా ఈ జాతర కోసం చేసే పనులన్నీ తాత్కాలికమే కావడంతో భక్తుల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి.

జాతర కోసం చేపట్టిన పనులు జాతర ముగిసిన వారం రోజుల్లోనే కనిపించకుండా పోతున్నాయని వాదనలు కూడా ఉన్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు మహాశివరాత్రి జాతర జరుగుతూ ఉంటుంది.ఈ జాతరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు.

Telugu Bakti, Devotees, Devotional, Rajannatemple, Siricilla, Temporary, Vemulaw

వారి సౌకర్యం కోసం తాత్కాలిక మరుగుదొడ్లు, చలువ పందిర్లు, అలంకరణలు, తాత్కాలిక నీటి కుళాయిలు, జల్లు స్నానాలను దేవాలయ నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు.అయితే వీటిని శాశ్వతంగా నిర్మిస్తే ప్రతి సంవత్సరం ఆర్థిక భారం తగ్గుతుందని, ఎందుకు అధికారులు ఆలోచించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.శాశ్వత నిర్మాణాలను ఎందుకు చేయడం లేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు.అధికారులు గుత్తేదారులకు ఆదాయం కల్పిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

Telugu Bakti, Devotees, Devotional, Rajannatemple, Siricilla, Temporary, Vemulaw

దేవాలయ దర్శనానికి అనేక ఇబ్బందులు ఉన్నాయని జాతరలో మరింత అద్వాన పరిస్థితి ఉంటుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంకా చెప్పాలంటే భక్తుల రక్షణ కోసం సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా ప్రసాదం కౌంటర్లు, వైద్య శిబిరాలు, సంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు దేవాలయ ముఖ్య అధికారులు వెల్లడించారు.ఈ జాతర కోసం ప్రతి సంవత్సరం మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వస్తారు ఈనెల 17వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఈ జాతర జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube