ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections )లితాలు బిజెపికి పెద్ద షాక్ ఇచ్చేలాగే కనిపిస్తున్నాయి.ప్రధాన పోటీ అంతా బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్యనే ఉందని, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని ఇప్పటికే అనేక సర్వే సంస్థలు, ఎగ్జిట్ పోల్స్ నిర్ధారణ చేశాయి.
బీ ఆర్ ఎస్ కు కూడా ఛాన్స్ ఉన్నట్లుగా మరికొన్ని సంస్థలు రిపోర్టులను వెల్లడించాయి.బిజెపి 15 నుంచి 20 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లుగా అనేక సర్వేలు వెల్లడయ్యింది.
ఇది ఇలా ఉంటే , ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిజెపికి బాగా ఎదురుగాలి వీచినట్టుగా ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతున్నట్లుగా ప్రకటించారు.
బీ ఆర్ ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాని పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. కరీంనగర్ లో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పట్టు సాధించబోతున్నట్లుగా సర్వేలు పేర్కొంటున్నాయి.
ఇక్కడ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం కూడా ఉందనే వార్తలతో బీజేపీ శ్రేణులు డీలా పడుతున్నాయి .
ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా పనిచేసిన కరీంనగర్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బండి సంజయ్ ( Bandi Sanjay )Wకు ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి .ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ హవా కొనసాగిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఒక సర్వే సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, ఒక స్థానంలో బీఆర్ఎస్ , మూడు స్థానాల్లో బిజెపి విజయం సాధిస్తుందని పేర్కొంది .ఆరా సంస్థ ఇచ్చిన సర్వే రిపోర్ట్ లో బీఆర్ఎస్ ఆరు నుంచి ఏడు స్థానాల్లో విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ ఐదు నుంచి ఆరు స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది.బిజెపి ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోదని పాయింట్ అవుట్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో తేలింది.13 స్థానాల్లో బీ ఆర్ ఎస్, రెండు స్థానాల్లో, కాంగ్రెస్ 11 స్థానాలు విజయం సాధిస్తుందని పేర్కొంది బిజెపి ఒక్క స్థానం కూడా గెలుచుకునే అవకాశం లేదని వెల్లడించింది.
పి టి ఎస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో రెండు నుంచి నాలుగు స్థానాలు టిఆర్ఎస్ పార్టీ లేదా రెండు స్థానాల్లో బిజెపి విజయం సాధిస్తుందని పేర్కొంది., పల్స్ టుడే సర్వేలో ధర్మపురి , రామగుండం, మంతాని , పెద్దపల్లి, జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని , చొప్పదండి మానకొండూరు వేములవాడ సిరిసిల్ల కరీంనగర్ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని , హుజురాబాద్ లో బీఆర్ఎస్ , బిజెపి మధ్య గట్టి పోటీ ఉంటుందని వెల్లడించింది.ఇది ఇలా ఉంటే ఉమ్మడి కరీంనగర్ లో బిజెపికి అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం తో బండి సంజయ్( Bandi Sanjay ) వర్గం తీవ్ర నిరాశలో ఉంది .తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు హోదాలో బండి సంజయ్ దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలోనే ఆయనను అకస్మాత్తుగా తప్పించి కిషన్ రెడ్డికి( Kishan Reddy ) బాధ్యతలను అప్పగించారు .ఇక అప్పటి నుంచి బండి సంజయ్ సైలెంట్ అయ్యారు.బిజెపి( BJP ) అధికారంలోకి వస్తే తనకు ముఖ్యమంత్రి పదవి దక్కవచ్చు అనే ఆశలతోనూ ఉన్న సంజయ్ కు ఇప్పుడు వెలువడబోతున్న ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించడంతో పాటు బిజెపి హై కమాండ్ వద్ద పలుకుబడి తగ్గేలా చేస్తుందనడంలో సందేహం లేదు.