మళ్లీ రీ ఎంట్రీ కి రెఢీ అంటున్న స్టార్ కమెడియన్...

The Star Comedian Who Wants To Re-enter Again., Babloo , Chitram , Arya , Comedian Babloo, Tollywood, Allu Arjun, Uday Kiran ,kushi

సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన చాలా మంది కమెడియన్స్ ఇక్కడ క్లిక్ అవ్వలేక కొన్ని సినిమాలు చేసి వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు…ఈ చాలా మంది సినిమా మీద పాషన్ తో ఇండస్ట్రీ కి వస్తూ ఉంటారు.పోతూ ఉంటారు…అయితే వారి కెరియర్ అనేది అదృష్టం పైన కూడా ఆధారపడి ఉంటుందని చెప్పాలి.

 The Star Comedian Who Wants To Re-enter Again., Babloo , Chitram , Arya , Comedi-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి ఎంతోమంది కమెడియన్లు అడుగుపెట్టారు అయితే వారిలో కొంతమంది మాత్రమే తెలుగు ప్రేక్షకులను బాగా అలరించారని చెప్పాలి.మరికొంతమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి.

ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్నా సరే ఎక్కువగా అవకాశాలు సొంతం చేసుకోలేక స్టార్ కమెడియన్ కాలేకపోతున్నారు…

దీంతో అవకాశాలు లేక ఇండస్ట్రీకి కనుమరుగవుతున్నారని చెప్పాలి.ఇక అలాంటి వారిలో ప్రముఖ కమెడియన్ బబ్లూ కూడా ఒకరు.

ప్రముఖ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమా( Chitram ) ద్వారా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఇండస్ట్రీకి పరిచయమైన బబ్లూ ఆ తరువాత ఆర్య( Arya ) వంటి సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు.చబ్బీ చీక్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే ఈయన రామ్ చరణ్ , అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు వంటి హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నాడు.

కానీ పెద్దగా ఆయనకు ఏ సినిమా కూడా గుర్తింపును అందించలేదు….

Telugu Allu Arjun, Arya, Babloo, Chitram, Kushi, Tollywood, Uday Kiran-Movie

పిల్లల్లాగా నటించే క్యారెక్టర్ లో ఎక్కువగా చేసిన బబ్లూ ప్రేక్షకులను పెద్దగా నవ్వించలేకపోయాడు.ఇక దీంతో స్టార్ కమెడియన్ కాలేకపోయారు.దాంతో అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి.

అయితే ఇన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న బబ్లూ(Babloo) ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను ఇండస్ట్రీకి దూరం అవడానికి గల కారణాన్ని వెల్లడిస్తూనే అందరిని కంటతడి పెట్టించారు.బబ్లూ మాట్లాడుతూ.

నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం.కెరియర్ పీక్స్ లో ఉండగానే ఆయన ఉన్నట్టుండి స్వర్గస్తులయ్యారు…

Telugu Allu Arjun, Arya, Babloo, Chitram, Kushi, Tollywood, Uday Kiran-Movie

బాధ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది.అదే సమయంలోనే అవకాశాలు వచ్చినా సరే వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాను.క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి.

అలా ఇండస్ట్రీకి దూరం అయ్యాను అంటూ ఆయన వెల్లడించారు.ఇక బబ్లూ పడిన కష్టాలు తెలిసి ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

మొత్తానికైతే అవకాశాలు మళ్లీ తలుపు తడితే నటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ పరోక్షంగా వెల్లడించారు బబ్లూ…అయితే ఈయన చాలా మంది పెద్ద హీరోలతో చేసిన కూడా ఈయన కి స్పెషల్ గా కమెడియన్ అనే గుర్తింపు అయితే రాలేదు…మారి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మళ్లీ రాణిస్తాడో లేదో చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube