మనలో టీ లవర్స్ ఎందరో ఉన్నారు.ఉదయం లేవగానే ఒక కప్పు వేడి వేడి టీ( Tea ) తాగకపోతే చాలామంది రోజును కూడా ప్రారంభించలేరు.
అంతలా టీ కు అలవాటు పడిపోయి ఉంటారు.ఉదయం ఒకసారి, మధ్యాహ్నం భోజనానికి ముందు ఒకసారి, భోజనం తర్వాత ఒకసారి, సాయంత్రం ఒకసారి, కుదిరితే రాత్రికి ఒకసారి.
ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నిసార్లు పడితే అన్ని సార్లు టీ తాగుతూనే ఉంటారు.టీ చెడ్డది అని ఏ అధ్యయనం ప్రూవ్ చేయలేదు.
కానీ అతిగా టీ తాగితే మాత్రం కచ్చితంగా పలు సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

లిమిట్ లెస్ గా టీ తాగేవారిలో రక్తహీనత ఏర్పడుతుంది.ఎందుకంటే, టీలోని టానిన్లు ఆహారంలోని ఐరన్ తో బంధించబడతాయి.శరీరం ఐరన్ ను గ్రహించడాన్ని కష్టతరం చేస్తాయి.
ఐరన్ కొరత రక్తహీనతకు దారి తీస్తుంది.అలాగే టీలోని టానిన్లు మీ జీర్ణ కణజాలానికి చికాకు కలిగిస్తాయి.
ఫలితంగా కడుపు నొప్పి,( Stomach Pain ) అతిసారం లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

అతిగా టీ తాగడం వల్ల నిద్రలేమి( Insomnia ) బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.టీలో ఉండే కెఫిన్ ( Caffeine ) నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.మీ నిద్ర చక్రానికి భంగం కలిగిస్తుంది.
కంటికి కునుకు కరువైతే ఎన్ని రోగాలు చుట్టేస్తాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.టీలో ఉండే కొన్ని సమ్మేళనాలు వికారం కలిగించవచ్చు.
ప్రత్యేకించి మీరు ఖాళీ కడుపుతో లేదా ఎక్కువ పరిమాణంలో టీ తాగినప్పుడు అటువంటి పరిస్థితిని ఫేస్ చేస్తారు.
అంతేకాకుండా బ్లాక్ మరియు గ్రీన్ టీ వంటి కొన్ని టీలలో కెఫిన్ ఉంటుంది.
టీ ను మితంగా తీసుకున్నప్పుడు ఈ కెఫిన్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు.కానీ లిమిట్ లెస్ గా తాగితే.అది ఆందోళన మరియు ఒత్తిడిని భారీగా పెంచేస్తుంది.ఇక ప్రెగ్నన్సీ సమయంలో టీ నుండి అధిక స్థాయి కెఫిన్ బాడీలోకి వెళ్తే.
గర్భస్రావం మరియు తక్కువ బరువుతో పిల్లలు పుట్టే ప్రమాదాన్ని పెంచుతుంది.







