సూర్యోదయం: ఉదయం 6:08
సూర్యాస్తమయం: సాయంత్రం 6:30
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
మేషం: వీలైనంత వరకు సంతోషాన్ని ఇచ్చే పనులే చెయ్యండి.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి.
అయితే డబ్బు అవసరం ఏ క్షణాన అయినా రావచ్చు.కాబట్టి వీలైనంత వరకు డబ్బును ఆదా చేసుకోండి.
ఈరోజు చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటి రోజు చివర ఆనందంగా గడుపుతారు.
వృషభం: పెళ్లి జరిగిన వారు పిల్లల చదువు కోసం కాస్త డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.ఇతరులు మీ పని తీరును, విజయాలను పొగడడం ద్వారా మీరు ఎంతో ఆనందిస్తారు.మీరు మీ పని ధ్యాస పెడితే రెట్టింపు లాభం పొందుతారు.అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తే మీకు ఎంతో గౌరవం దక్కుతుంది.
మిథునం: ఆరోగ్యంగా ఉంటారు కానీ ఆర్థికపరంగా కొన్ని సమస్యలు వస్తాయి.మాటలు తూటాల్లా పేలుస్తారు.ఈరోజు అంత ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు.దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయ్.పరిస్థితిని ఓర్పుతో ప్రశాంతంగా నిర్వహించేలా చూడటమే సరైన మార్గం.
కర్కాటకం: ఎంతోకాలం నుంచి సతాయిస్తున్న రుణ బాధలు తొలిగిపోతాయ్.అయితే కోపాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కోపం అదుపులో లేకుంటే ఉద్యోగాలు పోయే ప్రమాదం ఎక్కువ ఉంది.కొన్ని ఒత్తిడులు కారణంగా మీకు నచ్చిన పనులను చేయలేరు.
ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం.
సింహం: ఈరోజు అంత మంచే జరగనుంది.కాకపోతే కాస్త ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయ్.అయితే ఎటువంటి శ్రమ లేకుండానే ఎదుటి వారిని ఆకర్షిస్తారు.అయితే సొంతంగా ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించి సలహాలు తీసుకుంటే మంచిది.
కన్య: కష్టాల్లో ఉన్న కొందరు ఆప్తులు మిమ్మల్ని ఆర్ధిక సహాయం చెయ్యాలని కోరుతారు.కానీ అడిగిన వారి పరిస్థితి ఏంటి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోండి.ఇంటి విషయాలకు ఈరోజు అనుకూలమైన రోజు.ఇతరులను మెప్పించి లాభపడుతారు.వైవాహిక జీవితంలో కాస్త ఉపశమనం లభిస్తుంది.
తుల: ఈరోజు అంత ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తారు.ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు.
ఆరోగ్యపరంగా మీకు ఇది మంచి రోజు.సమస్యలను తెలివిగా వ్యవహరిస్తారు.
కొన్ని గొడవలు జరిగినప్పటికి రోజు చివరికి సంతోషంగా జీవిస్తారు.
వృశ్చికం: ఆర్ధిక లాభాలు ఎన్నో ఉంటాయ్.స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి సహాయం చెయ్యడమే కాకుండా మంచి ప్రేమ కూడా దక్కుతుంది.ఈరోజు అంత ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది.కాకపోతే బయట వారి వద్ద కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.
ధనుస్సు: గతంలో పెట్టిన పెట్టుబడు వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయ్.ఇతరులలో తప్పులు చూడటం మాని మీ జీవితాన్ని అద్బుతంగా చూసుకోండి.సృజనాత్మకత గల పనులలో నిమగ్నం అయ్యి సమయాన్ని వృధా చెయ్యకుండా జాగ్రత్తపడండి.ఈరోజు మీరు అనుకున్న పని జరుగుతుంది.
మకరం: మీకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు ఈరోజు మీ వద్దకు వస్తుంది.ఆరోగ్యం అంతంతమాత్రం ఉంటుంది.టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండండి.కావాలనుకున్న పనులు చెయ్యమని ఇతరులను బలవంత పెట్టకుండా ఉండేందుకు ప్రయత్నించండి.కొన్ని పనులు జరగవు.
కానీ రోజు చివరన ఆనందంగా గడుపుతారు.
కుంభం: ఎంతో డబ్బు సంపాదించినప్పటికి పొదుపు చెయ్యలేరు.మీకు అవసరమైన సమయంలో మీ సన్నిహితులు మీకు అందుబాటులో ఉండరు.కాబట్టి వీలైనంత వరకు పక్కవారి సహాయం లేకుండానే పనులు చేసుకునేందుకు ప్రయత్నించండి.ఈరోజు అంత ఎంతో ఆనందంగా గడుపుతారు.
మీనం: ఆర్థికపరంగా ఎటువంటి సమస్యలు రావు.పిల్లల నుంచి శుభవార్త వింటారు.మీ కింది ఉద్యోగుల నుంచి సలహాలు తీసుకోండి.వారు ఏం చెప్పాలనుకుంటున్నారో వినండి.మీరు మనసులో ఏం అనుకుంటున్నారో దానిని పక్కవారికి చెప్పడానికి భయపడకండి.
నోటి దురుసు తగ్గించుకుంటే మంచిది.