మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తరచూ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఎన్నో మంచి విషయాలను నెటిజన్లతో పంచుకుంటారు.వాటికి నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తుంటుంది.
తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో బాగా వైరల్ అయింది.నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది.భారతదేశపు అత్యంత పొడవైన రైలును కలిగి ఉన్న వీడియోను ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేశారు.6 లోకోలు, 295 వ్యాగన్లు, 25,962 టన్నుల బరువుతో భారతదేశం యొక్క పొడవైన రైలు అని ఆయన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.ఇక ఈ ట్రైన్‌కు వాసుకి అనే పేరు ఉంది.దాదాపు 3.5 కిలో మీటర్ల పొడవు ఉండే ఈ రైలు గురించి అంతా ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
వాసుకి అనే పేరున్న ఆ ట్రైన్‌కు ఉండే ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు.సాధారణంగా 100కి ఎక్కువగా తక్కువగా గూడ్స్ రైలుకు వ్యాగన్లు ఉంటాయి.అయితే అత్యంత పొడవైన రైలుగా పేరొందిన వాసుకికి చాలా వ్యాగన్లు ఉంటాయి.ఏకంగా 295 వ్యాగన్లు దీనికి ఉంటాయి.
అన్ని వ్యాగన్లతో ముందుకు సాగాలంటే దానికి తగిన ఇంజిన్లు అవసరం అందుకే ఆరు లోకోలను దానికి అటాచ్ చేశారు.ఇక ఈ భారీ రైలు సాధారణ గూడ్స్ రైళ్ల లాగా స్లోగా వెళ్తుందని అనుకుంటే పొరపాటే.
గంటకు 110 కిలో మీటర్ల వేగంగా ఆ రైలు పరుగులు తీస్తుంది.ఛత్తీస్‌గఢ్‌లోని కొఠారి రోడ్ రైల్వే స్టేషన్‌లో సరుకు రవాణా రైలు మెరుపు వేగంతో ప్రయాణించింది.
రెండు రోజుల క్రితం రైలు క్లిప్‌ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు.ఒక మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ ఆ వీడియోకు దక్కాయి.
ఆ వీడియోనే ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా స్వాతంత్ర్య దినోత్సవం నాడు సూపర్ వాసుకి రన్‌ను నిర్వహించినట్లు నైరుతి రైల్వే పేర్కొంది.