వైఎస్ వివేకా హత్య పై చంద్రబాబు అనవసర విమర్శలు చేస్తున్నారు ఎంపీ వైఎస్ అవినాష్ పాత్ర వివేక హత్య లో ఉందని బాబు మాట్లాడ్డం విచిత్రంగా ఉంది హత్యా రాజకీయాలు.వేధింపు రాజకీయాలు… జగన్ వైఖరి కాదు ప్రజా సమస్యల పై పోరాటం చేయడమే అసలు రాజకీయం కొన్ని మీడియాలలో అనవసర రాతలు రాయించి విషం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు వివేకా హత్య ఆ సమయంలో వైసీపీని షేక్ చేసింది.
ఎన్నికలకి నెల ముందు మాకు తగిలిన సడన్ షాక్.
ఆ టైం లో మాకు షాక్ ఇవ్వాల్సిన అవసరం టీడీపీకే ఉంటుంది.
సొంత మామ మరణానికి కారణమైన చంద్రబాబు లాంటి వ్యక్తి కి ఇలాంటి ఆలోచనలు వస్తాయి.హత్య ఎవరు చేశారు అనేది అక్కడ ఎవరిని అడిగినా తెలుస్తుంది.
విషయం తెలిసి అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు.వివేకా బావమరిది శివప్రకాష్ రెడ్డి సమాచారం ఇస్తే వెళ్లారు.
అవినాష్ కంటే ముందే అక్కడికి చాలా మంది వెళ్లారు.అవినాష్ వెళ్ళగానే సిఐ శంకరయ్యకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.
ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ సీబీఐ చేసిందా.ఇలాంటివి చెయ్యకుండా సీబీఐ ఏమి చేసింది.
ఆదినారాయణ రెడ్డి చెప్పిన మాటలు సీబీఐ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు.జరిగినది మొత్తం తీసుకుని ఉంటే ఇలాంటి ఛార్జ్ షీట్ వచ్చేదా.
వాస్తవాలని సీబీఐ ఎలా పక్కకి నెట్టింది అనే మా ప్రశ్నలకు సీబీఐ సమాధానం చెప్పాలి.అక్కడ దొరికిన లెటర్ ఉదయం నుండి సాయంత్రం వరకూ పోలీసుల దగ్గరకి ఎందుకు రాలేదు.
సాయంత్రం వరకూ లెటర్ ని ఎందుకు పోలీసులకు ఇవ్వలేదు.ఈ విషయం ఛార్జ్ షీట్ లో ఎందుకు పెట్టలేదు.
సీబీఐ అడ్డగోలుగా ఛార్జ్ షీట్ వేస్తే.చంద్రబాబు దానికి ఇంకాస్త యాడ్ చేసి చెప్తున్నాడు.
అవినాష్ విజయం కోసం అందరికంటే ఎక్కువ వివేకా బాధ్యత తీసుకుని పనిచేశారు.
వివేకా రాసిన లెటర్ దాచిపెట్టమంది ఎవరు.
రాజశేఖర్ రెడ్డి.అవినాష్ కాదు కదా.గుండె పోటుతో చనిపోయారని ఆదినారాయణ రెడ్డి చెప్పాడు కదా.? సీబీఐ ఛార్జ్ షీట్ లో పెట్టిన అంశాలు పచ్చి అపార్ధాలు.కావాలని వండి వార్చినవి.హత్య ఎవరు చేశారో తేలాలి.ఇలాంటి ఇన్వెస్టిగేషన్ జరిగితే అది జరుగుతుందా.యంగ్ లీడర్ గా అవినాష్ ఎదుగుదల చూసి చంద్రబాబుకి కుళ్ళబోతు తనం.గతంలో జగన్ పైనా ఇలాంటి కుళ్లుబోతు తనంతో సీబీఐ కేసు పెట్టారు.నీ కొడుకుకంటే చిన్నవాడు అవినాష్ పై ఇలాంటి అబండాలు వెయ్యడం దారుణం.
హత్యా, హింసా రాజకీయాలకు సీఎం జగన్ పూర్తి వ్యతిరేకంగా ఉంటారు.అపార్ధానికి బట్టలు వేస్తే చంద్రబాబులా ఉంటుంది.
ఆయన నోటి నుండి నిజం రాదు.చంద్రబాబు ఎంత నిప్పో ప్రజలకి తెలుసు.
అందుకే ఆయన్ని కాల్చేశారు.సీబీఐపై మేము ఆరోపణలు చెయ్యడం లేదు.
ప్రశ్నిస్తున్నాం.ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరుగుతున్నట్టు అనిపించడం లేదు
.