వయసు పైబడే కొద్ది అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో కీళ్ల నొప్పులు( Joint Pains ) ముందు వరుసలో ఉంటాయి.కనీసం ఇంటికి ఒక్కరైనా కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు.
అసలు కీళ్ల నొప్పులకు కారణాలేంటి.? వాటి నుండి రిలీఫ్ ఎలా పొందాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.కీళ్ల నొప్పులు అనేవి అనేక కారణాల వల్ల సంభవిస్తాయి.
వయస్సు పెరుగుతున్నప్పుడు కీళ్లలోని కార్టిలేజ్ తొలగిపోవడం, రుమటాయిడ్ ఆర్థ్రిటిస్, కీళ్ల చుట్టూ ఉన్న కండరాలు దెబ్బతినడం, కీళ్లకు సంబంధించిన గాయాలు, ఎక్కువగా కూర్చుని ఉండడం, శారీరక శ్రమ లేకపోవడం, శరీర బరువు అధికంగా ఉండటం, యూరిక్ ఆమ్లం ఎక్కువగా పేరుకుపోవడం, కీళ్లలో ఇన్ఫెక్షన్లు, పలు ఆరోగ్య పరిస్థితులు, కీళ్లపై అధిక ఒత్తిడి తదితర కారణాల వల్ల కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి.నొప్పి ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి.
ఇకపోతే కీళ్ల నొప్పుల నుంచి రిలీఫ్ అందించడానికి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా తోడ్పడతాయి.వెల్లుల్లి( Garlic ) కీళ్ల నొప్పులను తగ్గించడంలో గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.వెల్లుల్లిలో ఉండే అలిసిన్ నొప్పిని తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది.అందువల్ల ప్రతిరోజూ ఉదయం 2 వెల్లుల్లి రెబ్బలు తినడం అలవాటు చేసుకోండి.
కీళ్ల నొప్పులతో బాధపడేవారు నిత్యం నీలగిరి నూనెతో( Nilgiri Oil ) మసాజ్ చేసుకోండి.ఈ నూనెలలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గించడంలో సహాయ పడతాయి.
మరియు మసాజ్ చేయడం ద్వారా కీళ్ల చుట్టూ రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
అలాగే ప్రతి రోజూ పడుకునే ముందు ఒక గ్లాస్ పాలల్లో( Milk ) నాలుగు తులసి ఆకులు, పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసి మరిగించి తీసుకోండి.ఇది హల్తీ పాలల్లోని శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం అందించడమే కాకుండా చక్కటి నిద్రను ప్రోత్సహిస్తాయి.
ఇక విటమిన్ డి మరియు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
తాజా పండ్లు, పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, వాల్నట్స్, గుడ్లు వంటివి తీసుకోండి.గౌట్ సమస్యలుంటే యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఉండే ఆహారాలను నివారించండి.
అలాగే బరువు నియంత్రణను నియంత్రణలో ఉంచుకోండి.కీళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలపరచడానికి రోజూ తేలికపాటి వ్యాయామాలు చేయండి.
గాయం ఉన్నప్పుడు లేదా ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కీళ్లకు తగిన విశ్రాంతి ఇవ్వండి.