వంట రుచిని పెంచే అద్భుతమైన చిట్కాలు

మనం ఇంటిలో సూప్ తయారుచేస్తూ ఉంటాం.సూప్ లో కొంచెం పుదీనా పొడిని కలిపితే సూప్ రుచి పెరగటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

 Top Kitchen Tips For Preparation Of Delicious Food-TeluguStop.com

పెరుగు వడ రుచిగా రావాలంటే పిండి రుబ్బేటప్పుడు అందులో ఉడికించిన బంగాళాదుంప వేయాలి.పెరుగు వడ మృదువుగా రావటమే కాకుండా మంచి రుచిగా వస్తుంది.

పూరీలు మెత్తగా,మృదువుగా ఉంటే చాలా బాగుంటాయి.ఆలా రావాలంటే పూరి పిండి కలిపేటప్పుడు నీటికి బదులు పాలను కలిపితే మెత్తగా,మృదువుగా వస్తాయి.

ఇడ్లిలు మెత్తగా తెల్లగా రావాలంటే పప్పు నానబెట్టినప్పుడు అందులో కొంచెం సగ్గుబియ్యం కూడా వేయాలి.రెండు కలిపి రుబ్బుకుంటే ఇడ్లిలు తెల్లగా మంచి రుచిని కలిగి ఉంటాయి.

ఆలూ పరాఠా మంచి రుచిగా కలర్ ఫుల్ గా రావాలంటే పరాఠా పిండి కలిపేటప్పుడు కసూరి మెంతి వేయాలి.ఇలా వేయటం వలన రుచి రావటమే కాకుండా మంచి కలర్ ఫుల్ గా ఉంటాయి.

దోశలు క్రిస్పీగా రావాలంటే చిన్న చిట్కా ఉంది.అది ఏమిటంటే దోశల పిండిలో ఒక స్పూన్ పంచదార వేస్తె సరిపోతుంది.


కేక్ తయారుచేసేటప్పుడు పంచదారను గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు ఫ్రై చేయండి.ఆలా చేస్తే మంచి రంగుతో పాటు మంచి రుచి కూడా వస్తుంది.

పప్పును ఉడికించినప్పుడు కొంచెం పసుపు,రెండు స్పూన్ల బాదం ఆయిల్ లేదా నెయ్యి వేస్తె మంచి రంగుతో పాటు పప్పు రుచి కూడా పెరుగుతుంది.

సగ్గుబియ్యం పకోడీలు చేసేటప్పుడు పిండిలో రెండు బ్రెడ్ స్లైడ్స్ కలిపితే పకోడీలు రుచి రెట్టింపు పెరుగుతుంది.

సమోసాలు మంచి రుచి మరియు క్రిస్పీగా రావాలంటే పిండి కలిపేటప్పుడు కొంచెం నిమ్మరసం కలపాలి.

చపాతీ లేదా పరాఠాలు తాజాగా ఉండాలంటే చపాతీలు పెట్టె బాక్స్ లో చిన్న అల్లం ముక్కను పెడితే తాజాగా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube