పవన్ కళ్యాణ్.ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలను కూడా నడిపిస్తూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు.
అయితే రాజకీయాల్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ తగ్గిందా లేక అవసరం కోసం మాత్రమే సినిమాలను తీస్తున్నారు అని అనుమానం కొందరిలో ఉంది.పైగా రీమేక్ సినిమాలను ఎక్కువగా చేస్తున్నారనే అపవాది కూడా పవన్ కళ్యాణ్ మూట కట్టుకున్నారు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ తొలినాలలో తీసిన సినిమాలకి ప్రస్తుతం ఇస్తున్న సినిమాలకు ఎలాంటి పొంతన లేదు.పైగా అప్పట్లో ఆయన దగ్గరకు కొత్త దర్శకులు కూడా వెళ్లి కథలను చెప్పి ఒప్పించుకొని మరి సినిమా తీసే సాహసం చేయడానికి ముందుండేవారు.
మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా అంటే అది అనుమానమే.
పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎవ్వరినైనా సరే మీకు బాగా ఇష్టమైన సినిమా ఏది అని అడుగుతే తక్కువ చాలామంది బద్రి, తమ్ముడు, తొలిప్రేమ, ఖుషి అనే నాలుగు పేర్ల లో ఒక రెండు పేర్లు ఖచ్చితంగా చెబుతారు.ఇక ఆ తర్వాతే జల్సా, వకీల్ సాబ్, బిమ్లా నాయక్ వంటి సినిమాలు వస్తాయి.పవన్ కళ్యాణ్ కి తన తొలి డబ్ల్యూ తోనే బంపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కరుణాకరన్.
తొలిప్రేమ సినిమాతో వీరిద్దరికి కమర్షియల్ గా మంచి సినిమా లభించింది.అప్పట్లో ఈ సినిమా హిట్ అయ్యాక కరుణాకరన్ నీ ఒక భాగ్యరాజ్ గా వర్ణించేవారు.ఆ తర్వాత తమ్ముడు సినిమా సైతం చాలా మందికి ఎంతో నచ్చిన మూవీ.స్పోర్ట్స్ డ్రామా గారు తెరకెక్కి ఈ చిత్రం విజయం సాధించడంతోపాటు అప్పట్లో ఒక సంచలనం కూడా అయింది.
ఈ సినిమాకి కూడా అరుణ్ ప్రసాద్ అనే వ్యక్తి తొలిసారిగా తెలుగులో దర్శకత్వం వహించాడు.
ఇక ఓషో చెప్పిన డైలాగ్ ని కథగా మార్చి పవన్ కళ్యాణ్ చేత కథ ఒప్పించుకుని సినిమా తీసి సక్సెస్ కొట్టాడు పూరీ జగన్నాథ్.బద్రి సినిమా పూరీకి మొదటిది.దాంతో అటు పూరికి ఇటు పవన్ కళ్యాణ్ కి ఈ చిత్రం కెరియర్ లోనే చెప్పుకోదగ్గర చిత్రంగా మిగిలిపోయింది.
ఎస్ జై సూర్య కూడా తమిళ్ లో చేసినప్పటికీ తెలుగులో మొదటి సారి పవన్ కళ్యాణ్ హీరోగా ఖుషి సినిమా చేశాడు.ఈ సినిమా విజయవంతమైన తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ కూడా ఎక్కడికో వెళ్లిపోయింది.
సూర్య తమిళ్లో అజిత్ హీరోగా వాలి అనే సినిమా చేసి పవన్ కళ్యాణ్ ని ఖుషి సినిమా కథతో ఒప్పించాడు.