సాధారణంగా చాలా మందికి శరీరం మొత్తం తెల్లగా మృదువుగా ఉన్నా కూడా మోచేతులు మాత్రం నల్లగా అసహ్యంగా కనిపిస్తుంటాయి.కొందరు మోచేతుల నలుపును పెద్దగా పట్టించుకోరు.
కానీ కొందరు మాత్రం ఆ నలుపును పోగొట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ క్రీమ్ మీకు చాలా బాగా సహాయపడుతుంది.రెగ్యులర్ గా ఈ క్రీమ్ ను వాడితే మోచేతుల నలుపుకు గుడ్ బై చెప్పవచ్చు.
మరి ఇంతకీ ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
![Telugu Almond Oil, Aloevera Gel, Tips, Elbows, Elbows Cream, Latest, Magical Cre Telugu Almond Oil, Aloevera Gel, Tips, Elbows, Elbows Cream, Latest, Magical Cre](https://telugustop.com/wp-content/uploads/2024/09/This-is-a-magical-cream-to-get-rid-of-dark-elbows-dark-elbows-c.jpg)
ముందుగా ఒక బంగాళదుంపను ( potato ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి.
అలాగే ఆరు టేబుల్ స్పూన్లు బంగాళదుంప జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.రెండు మూడు నిమిషాల పాటు స్పూన్ తో కలిపితే మన క్రీమ్ అనేది రెడీ అవుతుంది.
![Telugu Almond Oil, Aloevera Gel, Tips, Elbows, Elbows Cream, Latest, Magical Cre Telugu Almond Oil, Aloevera Gel, Tips, Elbows, Elbows Cream, Latest, Magical Cre](https://telugustop.com/wp-content/uploads/2024/09/This-is-a-magical-cream-to-get-rid-of-dark-elbows-dark-elbows-d.jpg)
ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.రోజూ ఉదయం మరియు సాయంత్రం తయారు చేసుకున్న క్రీమ్ ను మోచేతులకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.రోజుకు రెండుసార్లు ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను వాడితే మంచి రిజల్ట్ ను పొందుతారు.బంగాళదుంప(potato) లో ఉండే బ్లీచింగ్ ఏజెంట్స్ మోచేతుల నలుపుని(dark elbows) సమర్థవంతంగా వదిలిస్తాయి.
అలాగే అలోవెరా జెల్, బాదం ఆయిల్ ( Aloevera Gel ,Almond Oil )కూడా మోచేతుల నలుపును పోగొడతాయి.కొద్దిరోజుల్లోనే మోచేతులను తెల్లగా మరియు మృదువుగా మారుస్తాయి.అందంగా మెరిపిస్తాయి.
ఇక ఈ క్రీమ్ ను మీరు డార్క్ సర్కిల్స్ కు కూడా ఉపయోగించవచ్చు.
నైట్ నిద్రించే ముందు కళ్ళ చుట్టూ క్రీమ్ ను అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఈ విధంగా చేస్తే డార్క్ సర్కిల్స్ వారం రోజుల్లోనే మాయమవుతాయి.