సాధారణంగా కొందరికి నోటి చుట్టు నల్లగా మారుతుంటుంది.ముఖం ఎంత తెల్లగా, అందంగా ఉన్నా.
నోటి చుట్టు ఏర్పడిన నలుపు వల్ల అందహీనంగా కనిపిస్తుంటారు.శరీర వేడి, పలు రకాల కాస్మోటిక్స్ వాడకం, ఒత్తిడి, వాతావరణంలో కలిగే మార్పులు ఇలా అనేక కారణాల వల్ల నోటి చుట్టు నల్లగా మారుతుంది.
దీంతో ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఓట్స్ తో ఈజీగా నోటి చుట్టు ఏర్పడిన నలుపును నివారించుకోవచ్చు.
మరి ఓట్స్‌ను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్‌లో ఓట్స్ పొడి, నిమ్మ రసం, ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుని.
నోటి చుట్టు అప్లై చేయాలి.ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.
ఆ తర్వాత కొద్దిగా నీళ్లు జల్లి వేళ్లతో రుద్దుతూ రుద్దుతూ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తూ ఉంటే.
క్రమంగా నలుపు తగ్గిపోతుంది.

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా ఓట్స్ పొడి, పాల పొడి మరియు తేనె వేసి కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని నోటి చుట్టూ పూతలా వేసి.అర గంట పాటు వదిలేయాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారంలో మూడు సార్లు చేస్తే.
నోటి చుట్టు నలుపు మటుమాయం అవుతుంది.
ఇక ఒక బౌల్‌లో ఓట్స్ పొడి మరియు బేకింగ్ సోడా సమానంగా తీసుకుని హాట్ వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నోటి చుట్టు పూసి.పావు గంట పాడు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒక సారి చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.