1.పీజీ దాకా బస్సు పాస్ ఫ్రీ
టీడీపీ అధికారంలోకి వస్తే పీజీ వరకు బస్ పాస్ ఇస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
2.అంబానీ కుటుంబానికి జెడ్ + కేటగిరీ భద్రత
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులకు దేశ, విదేశాలలో జెడ్ + కేటగిరి భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఈ భద్రత కోసం అయ్యే ఖర్చులను వారే సొంతంగా భరించాలని తెలిపింది.
3.బండి సంజయ్ కామెంట్స్
లిక్కర్ స్కాం ప్రభుత్వాన్ని గద్దె దించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటామని, మహిళలపై అత్యాచారాలు చేసేవారి ఇళ్లను బుల్ డోజర్స్ తో కూలుస్తామని సంజయ్ వ్యాఖ్యానించారు.
4.అమితాబ్ ధర్మేంద్రలకు బాంబు బెదిరింపు
బాలీవుడ్ దిగ్గజం అమితాబచ్చన్, ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ల నివాసాల సమీపంలో బాంబులు పెట్టినట్లు ఓ అగంతకుడు నాగపూర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి చెప్పాడు.
5.వీక్లీ ఎక్స్ ప్రెస్ సేవలు విస్తరణ
యశ్వంత్ పూర, హైదరాబాద్ ల మధ్య నడుస్తున్న వీక్లీ స్పెషల్ రైలు సేవలను మార్చి 29 వరకు విస్తరించాలని నైరుతి రైల్వే నిర్ణయించింది.
6.భాస్కర రెడ్డికి మరోసారి సిబిఐ నోటీసులు
మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ విచారించడంపై ఉత్కంఠ నెలకొంది.నేడు భాస్కర్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది.
7.జగన్ సవాల్ ‘ కన్నా’ కామెంట్స్
175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి ఏపీ సీఎం జగన్ చేసిన సవాలు పై ఇటీవల టిడిపిలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు.పోలీసులతో పాలన చేయడమా జగన్ రెడ్డి దమ్ము.ప్రతిపక్షాల నోరునొక్కడమా జగన్ రెడ్డి దమ్ము అంటూ కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
8.ఆధార్ అనుసంధానికి గడువు పెంచం
తమిళనాడులో విద్యుత్ కనెక్షన్ల వివరాలుతో ఆధార్ కార్డు వివరాలను అనుసంధానం పరిచేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పెంచే ప్రసక్తి లేదని విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ తెలిపారు.
9.జూన్ వరకు సికింద్రాబాద్ – రామనాథపురం రైలు సేవలు
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ రామనాథపురం మధ్య ప్రతి బుధవారం వీక్లీ రైలు నడుస్తోంది.దీనిని జూన్ వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
10.యువగళం పాదయాత్ర
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేటికీ 31 వ రోజుకు చేరుకుంది.ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ టోల్ గేట్ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.
11.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.మంగళవారం స్వామివారిని 59,392 మంది భక్తులు దర్శించుకున్నారు.
12.గ్రూప్ 2 పరీక్షలు
గ్రూప్ 2 పరీక్షలను ఆగస్ట్ 29, 30 వ తేదీలలో నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది.
13.పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి
గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనంతో పాటు, వారి న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు డిమాండ్ చేశారు.
14.తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శం
తెలంగాణ పథకాలకు యావత్ దేశం ఆదర్శంగా తీసుకుంటోందని బీ ఆర్ ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జోస్యం చెప్పారు.
15.ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్ల కోసం నిర్వహించే ఐసెట్ 23 నోటిఫికేషన్ విడుదలైంది.వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కేయూ బీసీ ప్రొఫెసర్ టి రమేష్, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి వరలక్ష్మి, రిజిస్టర్ శ్రీనివాసరావు నోటిఫికేషన్ విడుదల చేశారు.
16.జె సి ఓ , అగ్ని వీర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ పరీక్ష
భారత సైన్యంలో జూనియర్ కమిషన్ ఆఫీసర్స్ ఇతర ర్యాంకులతో పాటు, అగ్ని వీర్ ఉద్యోగాలు భర్తీ కోసం ఆన్లైన్ లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్స్ ఎగ్జామ్ ఉంటుందని సికింద్రాబాద్ ఆర్మీ నియామక కార్యాలయ డైరెక్టర్ కల్నాల్ కిట్స్ కె.దాస్ తెలిపారు.
17.బీసీ ఓవర్సీస్ విద్యానిధి గడువు పొడిగింపు
మహాత్మ జ్యోతిబాపూలే బిసి ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తు చివరి తేదీని వారం రోజులు పాటు పాడగిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
18.ఆన్లైన్ లో భద్రాద్రి నవమి టికెట్లు
భద్రాచలంలో మార్చి 30 31 తేదీల్లో నిర్వహించే శ్రీ సీతారామచంద్ర స్వామి తిరు కళ్యాణ మహోత్సవం పుష్కర సామ్రాజ పట్టాభిషేక మహోత్సవాలకు సంబంధించిన టికెట్లను ఈరోజు నుంచి ఆన్లైన్ లో విక్రయించనున్నారు.
19.ఆయుష్ యూజి సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్
ఆయుష్ యూజీ కోర్సుల్లో మిగిలిన సీట్ల లో ప్రవేశానికి వేకేన్సీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు కాళోజీ ఆరోగ్య వర్సిటీ ప్రకటించింది.
20.ఢిల్లీ మద్యం కేసులో ఐదుగురికి బెయిల్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది.